Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Telangana బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం

by Rama
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ప్రారంభమైంది. ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. స్థానికులు వాలంటీర్లుగా ఏర్పుడి ఉత్సవాల నిర్వహణ చూసుకుంటున్నారు. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుకల నేపథ్యంలో 10వ తేదీ వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఈ మేరకు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలపై, ట్రాఫిక్‌ అదనపు పోలీసు కమిషనర్‌ పి.విశ్వ ప్రసాద్‌ ఒక ప్రకటనలో విడుదల చేశారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం చేయాలని సూచించారు. ఆర్‌అండ్​బి కార్యాలయం, నేచర్‌క్యూర్‌ ఆసుపత్రి, జీహెచ్‌ఎంసీ గ్రౌండ్స్, పద్మశ్రీ అపార్ట్‌మెంట్స్‌ నేచర్‌క్యూర్‌ ఆసుపత్రి రోడ్‌ సైడ్‌ వైపు, ఫతేనగర్‌ రైల్వే వంతెన కింద, పద్మశ్రీ అపార్ట్‌మెంట్స్‌ నుంచి ఆర్‌ అండ్‌ బి కార్యాలయం వైపు పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగినా సహాయం కోసం 90102 03626 కు ఫోన్‌ చేయవచ్చని ట్రాఫిక్ పోలీసులు ప్రకటనలో తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన
    దేశానికి అన్నం పెట్టే అన్నదాత.. ఇప్పుడు అడుగడుగునా దగా పడుతున్నాడు. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ప్రార్థించిన ఆ కళ్లు.. ఇప్పుడు గిరిజన సహకార సంఘం కొనుగోలు కేంద్రాల వైపు దీనంగా చూస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో అన్నదాతల పరిస్థితి…
  • వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.
    రాష్ట్రంలో వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. రైతన్నలకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా అధికారులకు, విత్తన కంపెనీల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. నకిలీ విత్తనాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని,…
  • ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..
    ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ? ఎల్ అండ్ టీ లాంటి పెద్ద సంస్థ ఎందుకు మెట్రో రైల్ ను నడపలేకపోయింది ? ప్రభుత్వ పరం అయిన…
  • చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.
    చైల్డ్ ట్రాఫికింగ్ కేసును గుజరాత్ పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకుని దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేపట్టారు.‘ఆపరేషన్ దేవ్’ పేరిట గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు.ఈ కేసులో భాగంగా తెలంగాణలో మురుగన్ అలియాస్ నాగరాజు గ్యాంగ్‌ను గుజరాత్ పోలీసులు…
  • ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..
    ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,540 కోట్ల రూపాయలతో అమరావతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

009333
Total views : 61581

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.