అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్న జో బైడెన్ ప్రకటించడంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అధ్యక్ష పదవికి పోటీ పడే అర్హత బైడెన్‌కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా దేశానికి సేవలు అందించడానికి ఫిట్ కాదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ‘ట్రూత్ సోషల్’ వేదిక ద్వారా స్పందించారు. ‘‘బైడెన్ అధ్యక్ష పదవి కారణంగా మనం చాలా నష్టపోతాం. అయితే బైడెన్ కలిగించిన నష్టాన్ని మేము త్వరగా పూడ్చుతాము’’ అని అన్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన మరో అగ్రనేత, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ మైక్ జాన్సన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ పనికిరారని, అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటే మరి అధ్యక్షుడిగా కొనసాగడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో ఆయన అగ్నిమాపకశాఖ, సీఐడీ విభాగాల్లో విధులు నిర్వర్తించారు. సర్వీసు నిబంధనలు, క్రమశిక్షణ ఉల్లంఘనలపై ప్రభుత్వం రాతపూర్వక వివరణ కోరగా సంజయ్ ఇవ్వలేదు. దీంతో ఆయనపై…
- ఏపీ లోకాయుక్త జస్టిస్‌గా తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణం.ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్‌గా తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై జస్టిస్ మల్లికార్జునరావుకు అభినందనలు తెలిపారు. ఏపీ లోకాయుక్తగా…
- డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా కీలక పోస్ట్.కెనడాతో వాణిజ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా కీలక పోస్ట్ పెట్టారు. కెనడా, అమెరికాలతో సరిహద్దు పంచుకుంటున్న ‘లేక్ ఆంటారియో’ పేరును ‘లేక్ అమెరికా’గా మార్చే ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. తాము…
- ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్ష బరిలో బండ్ల గణేష్.తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నామినేషన్ దాఖలు చేశారు.ఆయనతో పాటు మరో నిర్మాత సి. కళ్యాణ్ కూడా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఈసారి జరగబోతున్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.దిల్…
- విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ ప్లేయర్స్ ఆక్షన్.మహిళల ఏపీ ప్రీమియర్ లీగ్ ప్లేయర్స్ ఆక్షన్‌కు సర్వం సిద్ధమైంది. విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ ప్లేయర్స్ వేలం జరగనుంది. వేలంలో 191 మంది మహిళా క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మేటి ఆటగాళ్ల కోసం నాలుగు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి