78వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు దేశ వ్యాప్తంగా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. మొదట రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను మోదీ ఎగుర వేశారు. ఎర్రకోట వద్ద ప్రధానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ నేతృత్వంలోని బృందం స్వాగతం పలికింది. తర్వాత త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరించారు. అనంతరం త్రివర్ణ పతకాన్ని ఎగురువేశారు. ఆ సమయంలో హెలికాప్టర్లు ద్వారా పూల వర్షం కురిపించారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా 2047నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలు, అందుకు కార్యాచరణను ప్రధాని మోదీ వివరించారు. పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట నుంచి వరుసగా పదేళ్లు పతాకావిష్కరణ చేసిన కాంగ్రెసేతర పార్టీల ప్రధానమంత్రుల్లో మొట్టమొదటి నేతగా నరేంద్ర మోదీ నిలిచారు. ఈ వేడుకలకు దాదాపు 6 వేల మంది ప్రత్యేక అతిథులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. అతిథుల్లో రైతులు, యువత, మహిళలు సహా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న 117 మంది అథ్లెట్లు, క్రీడాకారులు కూడా వేడుకల్లో పాల్గొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం, రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి సందేశాన్నే తన జీవితంలో ఆచరిస్తూ మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ దుబ్బ కిషన్. మే నెలలో…
- నిర్మల్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో విషాద ఘటన..నిర్మల్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల దయనీయ పరిస్థితికి అద్దం పట్టే ఘటన చోటుచేసుకుంది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రసవ వేదనలో ఉన్న ఓ గర్భిణి అటవీ ప్రాంతంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఎడ్లబండిపై ఆమెను…
- హైదరాబాద్‌లోని గండిపేట భూకబ్జా యత్నం కేసులో దర్యాప్తు..నకిలీ జీఓలు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు యత్నించిన అంతర్రాష్ట్ర భూ దందా ముఠాను పోలీసులు ఛేదించారు. పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో భూదందా గుట్టు వెలుగులోకి వచ్చింది. గండిపేట పరిధిలోని సర్వే నెంబర్ 18లో గల…
- హోంగార్డుపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు అరెస్ట్..అనకాపల్లి జిల్లా పరవాడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ కె.వి. రమణపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు నిందితులను పరవాడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఇటీవల అర్ధరాత్రి సమయంలో హోంగార్డ్ కె.వి. రమణపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో…
- నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఒక మహిళపై అత్యాచారం..నెల్లూరు జిల్లా గూడూరు మండలం మనుబోలు జాతీయ రహదారిపై కాగితాలపూరు సర్కిల్ వద్ద ఒక మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుంది . ఈ సంఘటన స్థానికంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 90152