Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh లడ్యూ వ్యవహారంలో కీలక మలుపు

లడ్యూ వ్యవహారంలో కీలక మలుపు

by Satya
లడ్యూ వ్యవహారంలో కీలక మలుపు

తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచార‌ణలో భాగంగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ విషయంలో స్వతంత్ర సిట్ తో విచార‌ణ జరిపించాలని కోర్టు ఆదేశించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ రోజు ఉదయం విచారణ చేపట్ట‌గా ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. సిట్ దర్యాప్తు కొనసాగాలా లేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు విచారణ అప్పగించాలా అన్న విషయంపై సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ‌తా అభిప్రాయం కోరింది. దీంతో సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ సిట్ విచార‌ణ‌పై త‌మ‌కు ఎలాంటి సందేహాలు లేవు అని అన్నారు. అయితే, సిట్‌పై ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక స్వతంత్ర ద‌ర్యాప్తు జ‌రిగితే మంచిదేన‌ని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. ద‌ర్యాప్తు సంస్థ‌లో ఐదుగురు స‌భ్యులు ఉండాల‌ని తెలిపింది. ఇందులో సీబీఐ నుంచి ఇద్ద‌రు, రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఇద్ద‌రితో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక నిపుణుడు ఉండాల‌ని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • (no title)
    నెల్లూరు జిల్లా గూడూరు మండలం మనుబోలు జాతీయ రహదారిపై కాగితాలపూరు సర్కిల్ వద్ద ఒక మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుంది . ఈ సంఘటన స్థానికంగా…
  • నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు..
    నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మర్రిపాడు, జంగాల కండ్రిక గ్రామాల్లో భారీ గాలుల వీచడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తలుపురుపాడు, తరుణవాయి, కొరిమెర్ల, జంగాల కండ్రిక గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి,…
  • ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం మేడిశెట్టి వారి పాలెంలో తీవ్ర గాలి దుమారం ..
    ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం మేడిశెట్టి వారి పాలెం గ్రామ శివారులో ఆదివారం భారీ వర్షం, ఈదురుగాలులు తీవ్ర నష్టాన్ని కలిగించాయి . బలమైన గాలుల ధాటికి ఓ ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపోయింది. సుమారు…
  • నాగోల్ నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ ..
    బీజేపీ రంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగూడలో 2 రోజుల పాటు నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ – 2026 కింద జిల్లా స్థాయి శిక్షణ శిబిరంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు…
  • ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్పై గెలిచిన బెంగళూరు..
    IPL 2026 సీజన్ విజేతగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నిలిచింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ ను ముద్దాడింది. తొలుత బ్యాటింగుకు దిగిన గుజరాత్ 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019244
Total views : 90144

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.