తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో స్వతంత్ర సిట్ తో విచారణ జరిపించాలని కోర్టు ఆదేశించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ రోజు ఉదయం విచారణ చేపట్టగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సిట్ దర్యాప్తు కొనసాగాలా లేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు విచారణ అప్పగించాలా అన్న విషయంపై సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయం కోరింది. దీంతో సొలిసిటర్ జనరల్ సిట్ విచారణపై తమకు ఎలాంటి సందేహాలు లేవు అని అన్నారు. అయితే, సిట్‌పై పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇక స్వతంత్ర దర్యాప్తు జరిగితే మంచిదేనని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. దర్యాప్తు సంస్థలో ఐదుగురు సభ్యులు ఉండాలని తెలిపింది. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరితో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక నిపుణుడు ఉండాలని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మేకెదాటు డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మేకెదాటు ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం గౌరవించడం లేదని ఆయన…
- భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిన్నెరసాని అభయారణ్యంలో పర్యాటకులను అలరించేందుకు జంగిల్ సఫారీ టూర్ ప్రారంభం అయింది. వనమహోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా పలు పనులను వర్చువల్‌గా ప్రారంభించారు. అందులో భాగంగా కిన్నెరసానిలో మూడు సరికొత్త సఫారీ వాహనాలను…
- జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం.జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల పునఃప్రారంభం నేపథ్యంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు కలిసి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో…
- తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. సుమారు 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న SIR- 2026 కార్యక్రమాన్ని జూన్ 25 నుంచి చేపట్టనున్నారు. ఈ కార్యక్రమ సన్నద్ధతపై రాష్ట్ర సీఈవో సి. సుదర్శన్ రెడ్డి అధికారులతో…
- హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాలలు, కళాశాలలను మాదకద్రవ్య రహిత విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 150518