Tuesday, September 15, 2026
News Navigation
Tuesday, September 15, 2026
News Navigation

Breaking

Tuesday, September 15, 2026
Home Andhra Pradesh ఎంపీ పుట్టా మహేష్ మరో ప్రెస్ నోట్ విడుదల.

ఎంపీ పుట్టా మహేష్ మరో ప్రెస్ నోట్ విడుదల.

by CVR NEWS

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో తన పేరు రావడంపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మరోసారి స్పందించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, ఈ ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటకు వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఆయన..ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఘటనలో తన పేరు ప్రస్తావనకు రావడం దురదృష్టకరమని..తాను డిన్నర్‌కు హాజరైన మాట వాస్తవమేనని..కానీ తాను ఎటువంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే ప్రజలకు, పార్టీ అధిష్టానానికి వాస్తవాలు తెలియజేస్తున్నానని వివరించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: