Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Andhra Pradesh రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో భారీగా పంట నష్టం..

రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో భారీగా పంట నష్టం..

by CVR NEWS

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతన్నలు అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని భరోసా కల్పించారు. అకాల వర్షాలతో పంట నష్టంపై సీఎం తన క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై వరుసగా రెండో రోజూ సీఎం సమీక్షించారు. భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న పంటల వివరాలను తెలుసుకున్నారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిళ్లిందని అధికారులు వివరించారు. వీటి విలువ రూ.40 కోట్లుగా అధికారులు తేల్చారు. 9 జిల్లాల్లో 48 మండలాల్లో 1,301 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజ్, నిమ్మ పంటలు దెబ్బతినట్లు అధికారులు వెల్లడించారు. ఉద్యాన పంటల నష్టం విలువ రూ.22.68 కోట్లుగా అంచనా వేశారు.

అలాగే, ఎల్పీజీ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ల సమస్య తలెత్తకుండా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ఇండక్షన్ స్టవ్‌లు, పీఎన్జీ, ఈవీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధంతో గ్లోబల్ సప్లయ్ చైన్ దెబ్బతినక ముందే అప్రమత్తం కావాలని సూచించారు. ఫెర్టిలైజర్లు, పెట్రోల్, డీజిల్ లోటు రాకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, విద్యాసంస్థలు, ఆలయాలకు ఎల్పీజీ సరఫరాలో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: