Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home International ఇరాన్ కండీషన్లకు ఒప్పుకున్న అమెరికా…

ఇరాన్ కండీషన్లకు ఒప్పుకున్న అమెరికా…

by CVR NEWS

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అంతర్జాతీయ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ పెట్టిన కఠిన నిబంధనలకు అమెరికా సానుకూలంగా స్పందించడంతో దౌత్యపరమైన చర్చలకు మార్గం సుగమమైంది. ఇరు దేశాల మధ్య అధికారిక చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ పెట్టిన రెండు ప్రధాన డిమాండ్లకు అమెరికా అంగీకారం తెలిపినట్లు అంతర్జాతీయ దౌత్య వర్గాలు వెల్లడించాయి. లెబనాన్ సరిహద్దుల్లో తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి, ఉద్రిక్తతలను తగ్గించడం, అంతర్జాతీయ బ్యాంకుల్లో అమెరికా ఆంక్షల కారణంగా ఫ్రీజ్ అయిన ఇరాన్ ఆస్తులను వెంటనే విడుదల చేయాలని అమెరికా ఎదుట ప్రతిపాదనలు పెట్టారు. అయితే, ఈ రెండు కండీషన్లకు అమెరికా అంగీకరించడం పశ్చిమాసియాలో రాజకీయాల్లో ఒక భారీ మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఇరాన్ ఆస్తుల విడుదల ద్వారా ఆ దేశానికి ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది. అదే సమయంలో లెబనాన్‌లో సీజ్‌ఫైర్ కుదరడం ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య యుద్ధ మేఘాలు తొలగిపోవడానికి దోహదపడనుంది.ఓ వైపు అమెరికాతో దౌత్యం నడుపుతూనే, ఇరాన్ తన పొరుగు దేశమైన పాకిస్థాన్‌ తో వ్యూహాత్మక చర్చలు జరుపుతోంది. శుక్రవారం అర్థరాత్రి అర్ధరాత్రి ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌తో సమావేశమైంది. ప్రాంతీయ భద్రత, సరిహద్దుల్లో ఉగ్రవాద నియంత్రణపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అంతేకాదు..అమెరికాతో జరగబోయే చర్చల నేపథ్యంలో పాక్ మధ్యవర్తిత్వం, మద్దతు కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఖతార్‌తోపాటు కొన్ని విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్‌ ఆస్తులను విడుదల చేసేందుకు అమెరికా అంగీకరించినట్లు తెలుస్తోంది. లెబనాన్‌లో కాల్పుల విరమణ, స్తంభింపజేసిన ఇరాన్‌ ఆస్తుల విడుదల అనే రెండు షరతులు అమలైతేనే చర్చలు జరుగుతాయని ఇరాన్‌ చెబుతోన్న విషయం తెలిసిందే. అయితే, వీటిలో స్తంభింపజేసిన ఆస్తుల్లో ఎంత మొత్తం విడుదల చేసేందుకు అమెరికా అంగీకరించిందనే విషయం తెలియరాలేదు. కేవలం ఖతార్‌లో స్తంభింపజేసిన 6 బిలియన్‌ డాలర్లను విడుదల చేసేందుకు ట్రంప్‌ యంత్రాంగం అంగీకరించినట్లు సమాచారం. దీనిపై అగ్రరాజ్యం నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
విదేశాలకు చమురు విక్రయించడం ద్వారా ఇరాన్‌కు భారీగా డబ్బు సమకూరినప్పటికీ వాటిని ఉపయోగించుకోలేకపోతోంది. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ఇవన్నీ స్తంభించిపోయాయి. ఆయా దేశాల బ్యాంకు ఖాతాల్లోనే అనేక బిలియన్‌ డాలర్లు ఉండిపోయాయి. కేవలం ఖతార్‌ బ్యాంకుల్లోనే ఆరు బిలియన్లు ఉన్నట్లు అంచనా. అయితే, వీటిని అమెరికా-ఇరాన్‌ల మధ్య జరిగిన ఓ ఒప్పందంలో భాగంగా 2023లోనే విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ.. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేయడంతో నాటి బైడెన్‌ యంత్రాంగం మళ్లీ స్తంభింపజేసింది

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: