Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh నేడు ముంబైలో సీఎం చంద్రబాబు పర్యటన ..

నేడు ముంబైలో సీఎం చంద్రబాబు పర్యటన ..

by CVR NEWS
క్వాంటం టెక్నాలజీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఎం చంద్రబాబు మరో అరుదైన జాతీయస్థాయి గౌరవాన్ని అందుకోబోతున్నారు. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025’ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న విధానాలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ఈ అవార్డును అందుకునేందుకు మధ్యాహ్నం ముంబైకి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రానికి దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను తీసుకురావడం ఈ అవార్డు ఎంపికలో కీలక పాత్ర పోషించింది.

ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఇవాళ సాయంత్రం 5:30 నుంచి 7:30 గంటల మధ్య ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాల సమక్షంలో చంద్రబాబు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. గతంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, నితీష్ కుమార్, అశ్వినీ వైష్ణవ్, ఎస్. జై శంకర్ వంటి ప్రముఖులు అందుకున్నారు. చంద్రబాబు ఇప్పుడు వారి జాబితాలో చేరనున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: