ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే సరికొత్త ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. జనాభా నియంత్రణ, సంతానోత్పత్తి తగ్గుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5 కంటే తక్కువకు పడిపోయిందని.. భవిష్యత్తులో మానవ వనరుల కొరత, వృద్ధాప్య సమస్యలను అధిగమించాలంటే ఈ కొత్త పాలసీ తప్పనిసరని సీఎం పేర్కొన్నారు. ఇదే వేదికపై రాష్ట్రాభివృద్ధిని ప్రస్తావించిన చంద్రబాబు.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించామని వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం కోసం ‘ప్రాజెక్టు సంజీవని’, విద్యార్థుల కోసం ‘ఏఐ లెర్నింగ్’ వంటి విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు ప్రకటించారు.
#ఆంధ్రప్రదేశ్ #చంద్రబాబు #సీఎం #జాతీయగౌరవం #రాజకీయాలు #పురస్కారం #రాష్ట్రవార్తలు #భారతరాజకీయాలు #నేతలు #గౌరవసమ్మానం
ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి ఉదయం 11.30 గంటలకు హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తోనూ సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించమన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచబ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్ లో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్ కు ఆయన హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్ధిక సలహా మండలి చైర్మన్ ఎస్. మహేంద్రదేవ్ సహా నీతిఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. సీఎం రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఈ పర్యటనకు ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం జరిగింది. SIPB సమావేశంలో దాదాపు 2లక్షల కోట్ల పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలపగా… 39వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. నిర్దేశిత గడువుకు ముందే అనుమతులతో బ్రాండ్ సృష్టిద్దామని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వస్తోందని … విశాఖలో రిలయన్స్ సంస్థ ఒకలక్షా 8 వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని తెలిపారు. అలాగే సత్యసాయి జిల్లాలో 51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంను కూడా రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. కడపలో 12 వేల కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును, తిరుపతిలో 2 వేల 5 వందల కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ సైకిల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు పలు పెట్టుబడులకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతీ ప్రతిపాదనా ఒప్పందంగా మారాలని, కుదుర్చుకున్న ప్రతీ ఒప్పందం పెట్టుబడిగా రూపాంతరం చెందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక పెట్టుబడి, పరిశ్రమ రాష్ట్రానికి వచ్చే విషయంలో అనుమతుల నుంచి శంకుస్థాపన, ప్రారంభోత్సవం వరకు నిర్దేశిత గడువులోగా జరిగేలా చూడాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెట్టుబడులను ఆకర్షించాలంటే ఇతరుల కంటే మనం ఎలా భిన్నమో ఏపీలో అనుమతులు ఎంత సులభతరమో వారికి చెప్పాలని స్పష్టం చేశారు. ఏపీలో ప్రాజెక్టులు రావాలన్న తపన ఉన్న అధికారులను అనుమతులు ఇచ్చే స్థానాల్లో నియమించాలని సూచించారు.
ఏపీ సీఎం చంద్రబాబు మరో అరుదైన జాతీయస్థాయి గౌరవాన్ని అందుకోబోతున్నారు. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025’ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న విధానాలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ఈ అవార్డును అందుకునేందుకు మధ్యాహ్నం ముంబైకి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రానికి దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను తీసుకురావడం ఈ అవార్డు ఎంపికలో కీలక పాత్ర పోషించింది.
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఇవాళ సాయంత్రం 5:30 నుంచి 7:30 గంటల మధ్య ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాల సమక్షంలో చంద్రబాబు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. గతంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, నితీష్ కుమార్, అశ్వినీ వైష్ణవ్, ఎస్. జై శంకర్ వంటి ప్రముఖులు అందుకున్నారు. చంద్రబాబు ఇప్పుడు వారి జాబితాలో చేరనున్నారు.





Total views : 201268