Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra Pradesh నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు..

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు..

by CVR NEWS
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి ఉదయం 11.30 గంటలకు హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తోనూ సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించమన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచబ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్ లో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్ కు ఆయన హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్ధిక సలహా మండలి చైర్మన్ ఎస్. మహేంద్రదేవ్ సహా నీతిఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. సీఎం రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఈ పర్యటనకు ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లనున్నారు.

 

Advertisements

You may also like

Our Visitor

039946
Total views : 202706

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: