ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య నెలకొన్న సుదీర్ఘ ఘర్షణలకు ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాలు తమ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో మూడు వారాల పాటు పొడిగించేందుకు అంగీకరించాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. దశాబ్దాలుగా ఉన్న ఉద్రిక్తతలను వీడి శాంతి మార్గంలో పయనించేందుకు ఇరు దేశాలు సిద్ధపడటం ప్రపంచవ్యాప్తంగా సానుకూల సంకేతాలను పంపుతోంది. ఈ కాల్పుల విరమణ కాలంలో సరిహద్దుల్లోని హిజ్బుల్లా దళాలు వెనక్కి తగ్గడం, ఇజ్రాయెల్ సైన్యం తమ స్థావరాలను పునఃసమీక్షించుకోవడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
సరిహద్దుల్లో తాజా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ, లెబనాన్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 45 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. అమెరికా జరిపిన కీలక మధ్యవర్తిత్వ చర్చల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. సరిహద్దుల్లో మరింత పురోగతిని సాధించేందుకు వీలుగా.. ఏప్రిల్ 16 నాటి శత్రుత్వాల నిలిపివేత ఒప్పందాన్ని మరో 45 రోజుల పాటు పొడిగించాలని నిర్ణయించాం” అని యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్ వెల్లడించారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఈ తాత్కాలిక గడువు ఆదివారంతో ముగియాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో ఊరట లభించింది.
రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక శాంతిని నెలకొల్పేందుకు అమెరికా ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తదుపరి చర్యలు ఇలా ఉండనున్నాయి..






Total views : 78452