Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home International అమెరికా జాతీయ నిఘా విభాగాధిపతి పదవికి తులసి గబార్డ్ రాజీనామా..

అమెరికా జాతీయ నిఘా విభాగాధిపతి పదవికి తులసి గబార్డ్ రాజీనామా..

by CVR NEWS
అమెరికా జాతీయ నిఘా విభాగాధిపతి పదవికి తులసి గబార్డ్ రాజీనామా

అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్‌, భారత సంతతి మహిళ తులసి గబార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన భర్త అబ్రహం విలియమ్స్‌కు అరుదైన బోన్ క్యాన్సర్ సోకినందున, ఆయనకు తోడుగా ఉండేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పంపిన తన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె రాజీనామా జూన్ 30, 2026 నుంచి అమలులోకి వస్తుంది.
తులసి రాజీనామాను ఆమోదించిన అధ్యక్షుడు ట్రంప్, ఆమె సేవలను ప్రశంసించారు. “తులసి అద్భుతంగా పనిచేశారు, ఆమె లేని లోటు మాకు తెలుస్తుంది,” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రిన్సిపల్ డిప్యూటీ డైరెక్టర్ ఆరోన్ లూకాస్ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని వైట్‌హౌస్ ప్రకటించింది. ఫిబ్రవరి 2025లో బాధ్యతలు స్వీకరించిన తులసి సుమారు 15 నెలల పాటు ఈ పదవిలో ఉన్నారు. అయితే, ఇరాన్ విషయంలో ట్రంప్ విధానాలతో ఆమె విభేదించారని, ఒత్తిడి కారణంగానే రాజీనామా చేశారని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. కానీ, ఈ ప్రచారాన్ని తులసి కార్యాలయంతో పాటు వైట్‌హౌస్ కూడా ఖండించింది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019159
Total views : 90034

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.