లదాఖ్‌లోని లేహ్ సమీపంలో గల తంగ్‌స్తే ప్రాంతంలో మే 20న జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుండి ముగ్గురు భారత ఆర్మీ అధికారులు తృటిలో ప్రాణాలతో బయట పడ్డారు. ముగ్గురు అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి. మే 20న జరిగిన ఈ ఘటనను అధికారులు ఈ ఉదయం ధృవీకరించారు.అయితే ప్రమాదం తర్వాత మేజర్ జనరల్ మెహతా మిగతా ఇద్దరు అధికారులతో కలిసి తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చీతా రకానికి చెందిన ఆ హెలికాప్టర్‌లో ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక మేజర్, 3వ పదాతిదళ విభాగానికి జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా ఉన్న మేజర్ జనరల్ సచిన్ మెహతా ప్రయాణిస్తున్నారు. లెఫ్టినెంట్ కల్నల్ సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్‌ను నడుపుతుండగా, మేజర్ జనరల్ మెహతా ప్రయాణికుడిగా అందులో ఉన్నారని ఒక సైనికాధికారి తెలిపారు. ఈ ప్రమాదం సందర్భంగా వీటి సెల్పీ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. తీవ్రంగా దెబ్బతిన్న హెలికాప్టర్ పక్కన అధికారులు రాళ్లపై కూర్చుని ఉన్న దృశ్యం ఆ చిత్రంలో కనిపిస్తోంది. అక్కడి కఠినమైన పర్వత ప్రాంతంలో కాలం చెల్లిన చీతా హెలికాప్టర్ల స్థితిని పరిగణనలోకి తీసుకుంటే, వారు ప్రాణాలతో బయటపడటం ఒక “అద్భుతం” అని అభివర్ణించారు.
లద్ధాఖ్ లేహ్ సమీపంలో ఆర్మీ హెలికాఫ్టర్‌కు ప్రమాదం..
71
previous post





Total views : 90019