Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Andhra Pradesh మలకపల్లి సహకార సొసైటీ పెట్రోల్ బంక్ లో నగదు గోల్ మాల్..

మలకపల్లి సహకార సొసైటీ పెట్రోల్ బంక్ లో నగదు గోల్ మాల్..

by CVR NEWS
మలకపల్లి సహకార సొసైటీ పెట్రోల్ బంక్ లో నగదు గోల్ మాల్

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని మలకపల్లి సహకార సొసైటీలో భారీగా నిధుల గోల్ మాల్ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్‌లో 22 లక్షల 30 వేల రూపాయల నగదు తేడా గుర్తించిన సహకార శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు నిధుల దుర్వినియోగం జరిగినట్లు ప్రాథమికంగా తేలింది. బంక్ నిర్వహణలో ఉన్న ముగ్గురు సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొవ్వూరు డివిజనల్ రిజిస్ట్రార్ నిర్వహించిన ఆడిట్‌లో ఈ వ్యవహారం బయటపడింది. సొసైటీ చైర్మన్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు కేసు నమోదు కాలేదు. అధికారులు ఏడు రోజుల్లోగా నగదు తిరిగి జమ చేయాలని నోటీసులు జారీ చేశారు.

మలకపల్లి సొసైటీ నిధుల గోల్ మాల్ కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ముగ్గురు సిబ్బంది, గుమస్తాతో పాటు అనధికారిక సిబ్బంది పాత్రపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సహకార శాఖ, పోలీస్ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక యువకుడిని విచారణ నిమిత్తం తీసుకెళ్లినట్లు సమాచారం రావడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అయితే విచారణలో భాగంగానే ప్రశ్నిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు. దుర్వినియోగమైన 22 లక్షల 30 వేల రూపాయలను రికవరీ చేయడానికి చర్యలు ప్రారంభమయ్యాయి. సొసైటీ చైర్మన్ ఫిర్యాదు చేసినా కేసు ఆలస్యం కావడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. అసలు బాధ్యులు ఎవరు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: