Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Latest News పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత..

పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత..

by CVR NEWS
పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత..

పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓవర్‌లోడ్ మట్టి లారీల రవాణాతో విసిగిపోయిన స్థానిక గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చి లారీలను అడ్డుకున్నారు. నిమ్మనపల్లి సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా ఏకమై మట్టి రవాణా వాహనాలను నిలిపివేసి భారీ ధర్నాకు దిగారు.
జిల్లాలోని కొదురుపాక చెరువు నుండి రాఘవపూర్ ఇటుక బట్టీలకు రాత్రింబవళ్లు వందలాది లారీల్లో మట్టిని తరలిస్తున్నారు. ఈ భారీ వాహనాల ఓవర్‌లోడ్ కారణంగా గ్రామంలోని అంతర్గత రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయని స్థానికులు మండిపడుతున్నారు. లారీలు వెళ్లేటప్పుడు లేస్తున్న విపరీతమైన దుమ్ము వల్ల ఇండ్లల్లో ఉండలేకపోతున్నామని, శ్వాసకోశ సమస్యలతో పిల్లలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత కొద్దిరోజులుగా ఈ అక్రమ, ఓవర్‌లోడ్ రవాణాను నిలిపివేయాలని ఆందోళనలు చేస్తున్నప్పటికీ.. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని సర్పంచ్ రమేష్ ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ మట్టి రవాణాను అరికట్టాలని, ఓవర్‌లోడ్ వాహనాలకు భారీ జరిమానాలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

020024
Total views : 92075

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.