Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Film తెలంగాణలో పెద్ది సినిమా టికెట్ ధరలు పెంపు..

తెలంగాణలో పెద్ది సినిమా టికెట్ ధరలు పెంపు..

by CVR NEWS
తెలంగాణలో పెద్ది సినిమా టికెట్ ధరలు పెంపు

రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్లో రూపొంది, త్వరలో విడుదల కానున్న “పెద్ది” టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం సదరు చిత్ర నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద ఊరటనిచ్చినప్పటికీ, సామాన్య ప్రేక్షకుడి జేబుకు మాత్రం అదనపు భారం కానుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై అదనంగా రూ. 100 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినివ్వగా.. మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రతి టికెట్ ధరపై అదనంగా రూ. 125 వరకు పెంచుకోవచ్చునని జీవోలో పేర్కొంది. ఈ సినిమాకు సంబంధించి జూన్ 3వ తేదీ రాత్రి ప్రదర్శించే ప్రత్యేక ప్రీమియర్ షోల టికెట్ ధరను ఏకంగా రూ. 600 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టికెట్ ధరల పెంపు సినిమా విడుదలైన రోజు నుండి గరిష్టంగా 10 రోజుల వరకు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆ తర్వాత ధరలు యథావిధిగా సాధారణ స్థితికి వస్తాయి.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019999
Total views : 92036

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.