Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Film దేశవ్యాప్తంగా “పెద్ది” ఫీవర్..

దేశవ్యాప్తంగా “పెద్ది” ఫీవర్..

by CVR NEWS
దేశవ్యాప్తంగా "పెద్ది" ఫీవర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా నటించిన సినిమా పెద్ది. ఉప్పెన సినిమాతో ప్రభంజనం సృష్టించిన బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా మెరిశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ప్రీమియర్లు పడిపోయాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని.. అతడి ప్రతి సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని అభిమానులు వెల్లడిస్తున్నారు. “పెద్ది” బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు. చ‌ర‌ణ్ బాడీ బిల్డింగ్ అందరికీ పిచ్చెక్కిస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో సరికొత్త రామ్ చరణ్ ను చూడవచ్చని చెబుతున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ సీన్ విజిల్స్ వేసేలా చేస్తుందని చెబుతున్నారు.

ఇక బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అందాలు అందరిని కనువిందు చేస్తాయని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో సాంగ్స్ ఆకట్టుకుంటాయని, ఏఆర్ రెహమాన్ ను మెచ్చుకుంటున్నారు. జగపతిబాబు అప్పలసూరి పాత్ర మరో లెవెల్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక స్టోరీలో ఎమోషనల్ సీన్స్ అదిరిపోయాయని వెల్లడిస్తున్నారు. శివ రాజ్ కుమార్ పాత్ర ఫస్ట్ ఆఫ్ లో చాలా తక్కువగా ఉంటుందని వెల్లడిస్తున్నారు. ఇక ఈ సినిమాలో క్రికెట్ మ్యాచ్ ల‌ను చాలా సాధారణ ప్రేక్షకుడు ఎంటర్ టైన్ అయ్యేలా చూపించినట్లు మెచ్చుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు రియల్ హీరోలుగా బుచ్చిబాబు, హీరో రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్ అంటున్నారు.

హైదరాబాద్ బాలానగర్ లో స్పెషల్ స్క్రీనింగ్ కు వచ్చిన రాంచరణ్ సతీమణి ఉపాసన, అభిమానుల మధ్య సినిమా చూసి ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో రామ్ చరణ్ స్క్రీన్ పైన కనిపించగానే.. ఫ్యాన్స్ తరహాలో ఆమె కూడా కేకలు వేశారు. అరుస్తూ గాల్లోకి పేపర్లు కూడా విసిరి… జోష్ లో కనిపించారు. కాగా పెద్ది సినిమా ప్రీమియర్లు పడ్డ నేపథ్యంలో థియేటర్లన్నీ కోలాహాలంగా మారాయి. సినిమా గురించి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో… వాటి నుంచి థియేటర్లలో జాతర షురూ అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: