Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Latest News ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

by CVR NEWS
ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు

తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ పెడతానంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జనసేన సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉద్దేశపూర్వకంగానే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలను ప్రజలు పూర్తిగా తిరస్కరించే పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే తమ ఉనికిని కాపాడుకోవడానికే మళ్లీ ప్రాంతీయ సెంటిమెంట్‌ను వాడుకుంటున్నాయని మండిపడ్డారు. గతంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన ఎంఐఎంతో బీఆర్ఎస్ కలిసి పనిచేయలేదా? అని ఆయన నిలదీశారు. అది తెలంగాణ వ్యతిరేక శక్తులతో పనిచేసినట్లు అవ్వదా? అంటూ ప్రశ్నించారు. రాజకీయ పరిస్థితులను బట్టి తెలంగాణలో పొత్తుపై ముందుకెళ్తామని రామచందర్ రావు స్పష్టం చేశారు. జనసేనతో పొత్తుపై పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

020224
Total views : 92536

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.