Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home International ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.

by CVR NEWS
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

ఫిలిప్పీన్స్‌లోని మిండనావ్ ప్రాంతాన్ని భారీ భూకంపం వణికించింది. తొలుత 8.2 తీవ్రతగా నమోదైన ఈ భూకంపాన్ని తర్వాత కొన్ని అంతర్జాతీయ సంస్థలు 7.8 తీవ్రతగా సవరించాయి. అయినప్పటికీ ఇది అత్యంత శక్తివంతమైన భూకంపంగా అధికారులు పేర్కొంటున్నారు. భూకంపం అనంతరం ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండోనేషియా, తైవాన్, పపువా న్యూ గినియా తదితర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.భూకంపం కారణంగా కొన్ని ప్రాంతాల్లో భవనాలు దెబ్బతినగా, విద్యుత్, కమ్యూనికేషన్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో భూటాన్, చైనా, భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూకంప ప్రకంపనలు నమోదవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: