176
ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ కూలిపోయినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.ప్రమాదం జరిగిన వెంటనే సహాయక, రక్షణ బృందాలు రంగంలోకి దిగి హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.హెలికాప్టర్ కూలడానికి గల కారణాలపై స్పష్టత రాలేదు. సాంకేతిక లోపమా, వాతావరణ పరిస్థితుల ప్రభావమా లేదా ఇతర కారణాలున్నాయా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.