148
సౌదీ అరేబియా మదీనా బస్సు ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రమాదంలో మరణించిన మహమ్మద్ జాఫర్, షేక్ సిరాజ్ కుటుంబాలకు పెండింగ్‌లో ఉన్న రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్ సచివాలయంలో పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తాము సౌదీకి వెళ్లి, భారత కాన్సులేట్ సాయంతో అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేలా చూశామని మంత్రి తెలిపారు. క్లిష్ట సమయంలో ప్రభుత్వం అందించిన మానవతా సహాయానికి బాధితుల కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.