Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Latest News తమిళనాడు ప్రజలకు తీపికబురు చెప్పిన సీఎం విజయ్.

తమిళనాడు ప్రజలకు తీపికబురు చెప్పిన సీఎం విజయ్.

by CVR NEWS
తమిళనాడు ప్రజలకు తీపికబురు చెప్పిన సీఎం విజయ్

తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తన పుట్టిన రోజున కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. జూన్ 22న ఆయన జన్మదినోత్సవం సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు కొత్త తరహా రేషన్ కార్డులు అందివ్వనున్నారు. ఆహార, పౌరసరఫరా శాఖ అధికారులు ఇప్పటికే 46 వేల కొత్తరేషన్ కార్డులను ప్రింట్ చేశారు. వాటిని పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి సుమారు 2..25 లక్షల మంది కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే తొలిదశలో 46 వేల మందికి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు సమాచారం. పెరంబదూర్‌లో జరిగే బర్త్‌ డే కార్యక్రమంలో సీఎం విజయ్ కొత్త రేషన్ కార్డులను డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ తొలిసారి పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ కోసం టీవీకే భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

025260
Total views : 146770

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.