ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా ఈనెల 15 నుండి ప్రారంభం కానున్న అమ్మవారి ‘సారె సమర్పణ’ మహోత్సవాలకు దేవస్థానం సర్వసిద్ధమైంది. ఈ నేపథ్యంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, క్యూ లైన్ల నిర్వహణను ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ఆలయ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో శీనా నాయక్ మాట్లాడుతూ, ఆషాఢ సారె సమర్పణకు విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ప్రత్యేక మరియు పక్కా ప్రణాళికలతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఈసారి శ్రీ కనకదుర్గ నగర్‌లోనే క్లోక్ రూమ్, ఉచిత పాదరక్షల స్టాండ్ (చెప్పుల స్టాండ్), మరియు మొబైల్ ఫోన్లు భద్రపరుచుకునే పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.




Total views : 207700