39
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదురై సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సు, ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రులకు పంపించారు.




Total views : 207700