ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. ఇటీవల ముంబైలో పవన్ కుడి భుజానికి శస్త్ర చికిత్స చేసుకుని… తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శస్త్ర చికిత్స అనంతరం పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి… గవర్నర్ తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ స్వగృహంలో ఉన్న లైబ్రరీని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తిలకించారు. లైబ్రరీలోని పలు పుస్తకాలను పరిశీలించారు. ప్రఖ్యాత రచయితలు, స్కాలర్స్, విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ మేకర్స్ రాసిన పుస్తకాలు చూశారు. వాటి గురించి పవన్ కళ్యాణ్‌తో ఆసక్తిగా చర్చించారు. పవన్ కళ్యాణ్ కోరడంతో ఓ పుస్తకంపై జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆటోగ్రాఫ్ చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎంతో ఆప్యాయతతో వచ్చి పరామర్శించినందుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
పవన్‌కల్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్ నజీర్.
29
previous post




Total views : 212465