పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా సైన్యం మరో విడత భారీ దాడులను ప్రారంభించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల రక్షణే ధ్యేయంగా ఈ దాడులు జరుపుతున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ మేరకు అమెరికా సైన్యం మరోసారి రెండు విడతలుగా ఇరాన్ సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. గ్రేటర్ టున్బ్ ద్వీపంలోని ఇరాన్ తీరప్రాంత రక్షణ వ్యవస్థలు, క్రూజ్ క్షిపణుల నిల్వ కేంద్రాలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలపై అమెరికా వైమానిక దళం కచ్చితమైన లక్ష్యాలతో బాంబుల వర్షం కురిపించింది. దాదాపు 90 నిమిషాల పాటు మొదటి విడత దాడులు సాగాయి,. అనంతరం హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉన్న ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు అమెరికా రెండో విడత దాడులను కూడా విజయవంతంగా నిర్వహించింది. ఇరాన్ పోర్టులపై అమెరికా నావికా దళం ఆంక్షలను పునరుద్ధరించిన నేపథ్యంలో ఈ తాజా దాడులు చోటుచేసుకున్నాయి.
ఇరాన్‍పై అమెరికా రెండో విడత దాడులు.
28
previous post




Total views : 212575