Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh మళ్లీ పెరిగిపోతోన్న కొవిడ్-19 కేసులు.

మళ్లీ పెరిగిపోతోన్న కొవిడ్-19 కేసులు.

by CVR NEWS
మళ్లీ పెరిగిపోతోన్న కొవిడ్-19 కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తక్షణమే అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 26వ తేదీ నుంచి జులై 16 వరకు రాష్ట్రంలో మొత్తం 12 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ కేసులను కడప, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో గుర్తించారు. నలుగురు మరణించినట్లు ఆరోగ్య శాఖ వర్గాలు ధ్రువీకరించాయి. మిగిలిన బాధితుల్లో ముగ్గురు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండగా, ఇతరులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా లక్షణాలు కనిపించిన వారికి వెంటనే పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టమైన సూచనలు ఇచ్చింది. ప్రస్తుతానికి కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

041005
Total views : 212630

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: