Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Latest News నేడు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన.

నేడు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన.

by CVR NEWS
నేడు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని మోదీ ఇవాళ మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. హర్యానా, పంజాబ్, చండీగఢ్‌లో ప్రధాని పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో వివిధ రాష్ట్రాల్లో రూ.26,800 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని మోదీ తొలి కార్యక్రమం హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో జరగనుంది. జింద్‌లో పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు..అక్కడి నుంచి దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. జింద్-సోనిపట్ మధ్య ఈ ట్రైన్ నడవనుంది. దేశంలో ఇప్పటివరకు హైడ్రోజన్ రైళ్లు లేవు. ఇదే తొలి ట్రైన్. స్వదేశీ టెక్నాలజీతో భారత్‌లోనే ఈ రైలును తయారుచేశారు. ఈ రైలు నుంచి ఎలాంటి హనికరమైన పొగ రిలీజ్ అవ్వదు. ఎలాంటి హానికరమైన పొగ రిలీజ్‌ అవదని..దీనివల్ల పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుందని రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని రైళ్లను తీసుకురానున్నట్టు చెబుతున్నారు.

ఇక ఈ పర్యటన సందర్భంగా కురుక్షేత్రలో సిక్కు మ్యూజియానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. చండీగఢ్‌లో రూ.6,600 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనుండగా..PGIMERలో కొత్త కేంద్రాలు ప్రారంభించనున్నారు. ఇక ఢిల్లీ-అమృత్ సర్-కత్రా ఎక్స్‌ప్రెస్ హైవేను జాతికి అంకితం చేయనుండగా.. 75 అమృత్ సర్ భారత్ స్టేషన్లను ప్రారంభించనున్నారు. మంగళగిరి, రాయనపాడుతో పాటు కంబం రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. అలాగే కర్టోలి–అంబాలా, అమృత్‌సర్ –వారణాసి మధ్య కొత్త రైలు సర్వీసులను పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు.

జింద్- సోనిపత్ మధ్య రెండు రౌండ్ ట్రిప్పుల ద్వారా ప్రతిరోజూ సుమారు 356 కిలోమీటర్లు సర్వీసులు అందించనుంది. గంటకు 75 కి.మీ నుండి 120 కి.మీ. వరకు సామర్థ్యంతో నడవనుంది. ఇందులో రెండు డ్రైవింగ్ పవర్ కార్లు, ఎనిమిది ప్యాసింజర్ కోచ్‌లతో సహా మొత్తం 10 కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి. 2600 మంది ప్రయాణికులు ఒకేసారి వెళ్లవచ్చు. ఈ కోచ్‌లు చాలా లగ్జరీగా ఉంటాయి. అయితే కేవలం నాన్ ఏసీ కోచ్‌లు మాత్రమే ఇందులో ఉంటాయి. ప్రపంచంలో ఇతర దేశాల్లో హైడ్రోజన్ రైళ్లు ఉండగా.. ఇంత పొడవైన రైలు ఎక్కడా లేదు. దీంతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తున్న దేశంగా భారత్ నిలవనుంది. రైల్వే రంగంలో ఇది సరికొత్త విప్లవంగా చెప్పవచ్చు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040980
Total views : 212574

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: