Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.

అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.

by CVR NEWS
అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహోత్సవాల్లో తొలి రోజు వేదపండితులు అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, హరితమ్మ దంపతులకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని శ్రీ విరుపాక్షమ్మ తల్లిని ప్రార్థించినట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040990
Total views : 212591

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: