Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Latest News కార్పొరేషన్ల పరిధిలో అభివృద్ధిపై సీఎం సమీక్ష.

కార్పొరేషన్ల పరిధిలో అభివృద్ధిపై సీఎం సమీక్ష.

by CVR NEWS

హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. సమీక్షలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై MCRHRD బోధి పెవిలియన్‌లో మున్సిపల్ పరిపాలనా శాఖ అధికారులతో సమీక్షించారు. అభివృద్ధి పనుల కోసం అవసరమైన భూ సేకరణ జరపకుండా టెండర్లను పిలవొద్దని, భూ సేకరణ కోసం ప్రత్యేక అధికారిని నియమించామని తెలిపారు. మూడు కమిషనరేట్ల పరిధిలో పనుల అనుమతుల కోసం అన్ని శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమన్వయ సమావేశం నిర్వహించాలని చెప్పారు. సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయనున్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విగ్రహం, జంక్షన్ పనులను వేగవంతం చేయాలని హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి… నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ భవన నమూనా, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నమూనాను పరిశీలించి పలు సూచనలు చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: