Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh గురజాలలో 24 మందికి అంగన్వాడీ ఉద్యోగ నియామక పత్రాల అందజేత.

గురజాలలో 24 మందికి అంగన్వాడీ ఉద్యోగ నియామక పత్రాల అందజేత.

by CVR NEWS

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్లలో అంగన్వాడీ ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నూతనంగా ఎంపికైన 24 మంది అంగన్వాడీ సిబ్బందికి నియామక పత్రాలను అందజేశారు. ఇందులో పిడుగురాళ్ల, గురజాల ఐసీడీఎస్ పరిధిలో ఎంపికైన 5 మంది అంగన్వాడీ టీచర్లు, 19 మంది హెల్పర్లు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, అధికారుల మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజలకు నిబద్ధతతో సేవలందించాలని సూచించారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన సేవలు అందించడంలో అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, ప్రజాసేవలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: