Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Latest News సీజేపీ తర్వాత పుట్టుకొచ్చిన మరో పార్టీ.

సీజేపీ తర్వాత పుట్టుకొచ్చిన మరో పార్టీ.

by CVR NEWS

నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన కాక్రోచ్ జనతా పార్టీ లాగానే ఇప్పుడు కొత్తగా EJP పార్టీ పుట్టుకొచ్చింది. E20 జనతా పార్టీ పేరుతో కొత్తగా డిజిటల్ ప్రచారం మొదలైంది. E20 పెట్రోల్‌తో పాటు వినియోగదారులకు 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్ కొనుగోలు చేసే అవకాశం ఇవ్వాలనేది ఈ పార్టీ ప్రధాన డిమాండ్. E20 జనతా పార్టీ పేరుతో ఇప్పటికే ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రత్యేక అకౌంట్లు క్రియేట్ అయ్యాయి. ఇంధనం విషయంలో కూడా వినియోగదారులకు తాము ఎంచుకున్న పెట్రోల్ కొనుగోలు చేసే హక్కు కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రభుత్వం E20ను అందుబాటులో ఉంచినా, దానితో పాటు 100 శాతం పెట్రోల్‌ను కూడా విక్రయించాలని కోరుతున్నారు. కొందరు వాహన యజమానులు 20 శాతం ఇథనాలు కలిపిన E20పెట్రోల్ వాడటం వల్ల వాహనాల ఇంజన్లు దెబ్బతింటున్నాయని, మైలేజ్ తగ్గిందని ఆరోపిస్తున్నారు. నిర్వహణ ఖర్చులు పెరిగినట్లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం E20 జనతా పార్టీ పేరిట ఉన్న X ఖాతాకు 13 వేలకుపైగా, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 8,800కుపైగా ఫాలోవర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: