6
ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంజనేయులు సర్వీస్ నుంచి రిలీవ్ అయ్యే విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 31తో పీఎస్ఆర్ ఆంజనేయులు సర్వీస్ కాలం ముగియనుంది. అదే రోజు ఆయనను సర్వీస్ నుంచి రిలీవ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆంజనేయులుపై నమోదైన క్రిమినల్ కేసుల కొనసాగింపునకు రిటైర్మెంట్ అడ్డంకి కాదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం. క్రిమినల్ కేసులు, సంబంధిత విచారణలు కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెన్షన్, ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలపై తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆంజనేయులుపై సస్పెన్షన్ సహా పలు చర్యలు కొనసాగుతున్నాయి.