పల్నాడు జిల్లా, సత్తెనపల్లి శరభయ్య హైస్కూల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న స్పోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న, జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్. జాయింట్ కలెక్టర్ బౌలింగ్ చేయగా బ్యాటింగ్ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ. క్రీడాకారులతో ఆడుకుందాం ఆంధ్ర గురించి అడిగి తెలుసుకున్న పి.ఎస్. క్రికెట్ ను వీక్షించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ, జాయింట్ కలెక్టర్.
Guntur
గుంటూరు పట్టణంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభం చేసిన మంత్రి రజినీ. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ గ్రామీణ యువత లోని ప్రతిభ ను వెలికి తీయడానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం వారికి ఎంతో తోడ్పాటు ఇస్తుంది అని అన్నారు. యువతను ఉత్తేజ పరచడానికి షటిల్ అడిన మంత్రి విడుదల రజినీ, ఎమ్మెల్యే మద్దాల గిరి. అందరూ క్రీడల వైపు దృష్టి సారించాలి. ప్రభుత్వం ఐదు రకాల క్రీడలను ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ప్రవేశ పెట్టారు. క్రీడాకారులకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి గుర్తింపు వస్తుంది. క్రీడల వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓ గొప్ప కార్యక్రమం రూపకల్పన చేశారు.
పల్నాడు జిల్లా, దాచేపల్లిలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి నిర్వహించే ఆత్మీయ సమావేశం అర్ధాంతరంగా నిలిచింది. వైసిపి అధిష్టానం పిలుపు వచ్చిందంటూ చెప్పి సమావేశం నుండి వెళ్లిపోయిన ఎమ్మెల్సీ కృష్ణమూర్తి. గురజాల నియోజకవర్గంలో జంగా కృష్ణమూర్తి జోరుగా పర్యటన. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
ఫిర్యాదు మేరకు జంగాకు అధిష్టానం నుండి పిలుపు అంటూ ప్రచారం. అధిష్టానం రమ్మని పిలుపునిచ్చిందని స్వయంగా చెప్పి సమావేశం నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.
పల్నాడు జిల్లా, సత్తెనపల్లిలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థల్లో దోపిడీ జరిగింది. వేల ఎకరాల అసైన్డ్ భూములన్నీ కొట్టేశారు. రెవెన్యూ చట్టాన్ని మార్చారు. దానికోసమే అడ్వకేట్లంతా కోర్టులను బాయికాట్ చేస్తున్నారు. రాష్ర్టంలో రైతుల భూములన్నీ నాయకుల చేతిలోకి తీసుకుని వెళ్ళాలని చూస్తున్నారు. మా పార్టీ లోకి రాకుంటే భూములు లాక్కుంటము అనే ఉద్దేశంతో ఈ చట్టం. డాక్యుమెంట్ మా దగ్గర ఉంటుంది డౌన్ లోడ్ చేసుకోండి అంటున్నారు.ఇది చాలా పెద్ద ప్రమాదం. ఎవరు ఎన్ని డాక్యుమెంట్ లైన డౌన్ లోడ్ చేసుకోవచ్చు.ఎన్ని బ్యాంక్ లలో నైన లోన్ తీసుకోవచ్చు. ప్రజలను నిలువు దోపిడీ చేద్దామని చూస్తున్నారు. ఇకనైనా జగన్ మీ దోపిడీ ఆపాలి. మేం అధికారంలోకి రాగానే ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం.
పల్నాడు జిల్లా, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి. అంగన్వాడీలకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మధ్య మాటల యుద్ధం. ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు. సిఐటియు నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట సమస్య పరిష్కారిచేవరకు నిరసన చేస్తామంటున్న అంగన్వాడీలు. సీఎం డౌన్ డౌన్ అంటూ సిఐటియు నేతలు నినాదాలు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.
సిఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన 16వ రోజు సమ్మెలో భాగంగా బుధవారం ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన అంగన్వాడీలను వినుకొండ ఎమ్మెల్యే బోల్లా బ్రహ్మనాయుడు పార్టీ కార్యాలయం వద్ద సీఐ సాంబశివరావు ఆధ్వర్యంలో పోలీసులు రోడ్డుకు అడ్డుగా భారీ గేట్స్ ఏర్పాటు చేసి అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. ఓటు కోసం ఇంటి దగ్గరికి వచ్చి అడిగిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కి వినతి పత్రం ఇవ్వడానికి వస్తే పోలీసు చేత ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. వినతి పత్రం తీసుకునే అంతవరకు వెళ్లేది లేదని ఎమ్మెల్యే కార్యాలయం ముందు అంగన్వాడీలు బైఠాయించారు.
గుంటూరు జిల్లా.. తూళ్ళురు మండలం ఐనవోలు గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి నుంచి 320 మద్యం బాటిల్స్ లను వాటి విలువ సుమారు 1,10 వేల రూపాయల బాటిల్స్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో SEB అదనపు ఎస్పీ సుప్రజ మాట్లాడుతు తూళ్ళురు మండలంలో తమ సిబ్బంది చాకచక్యంగా పట్టుకుని వారి వద్ద నుంచి భారీగా మధ్యం స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలియజేశారు. స్థానికులు కూడా తమ వద్ద ఇలాంటి సంఘ వ్యతిరేకులపై సమాచారం చెప్పాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సుప్రజ తెలియజేశారు.
అంగన్వాడీల 11 డిమాండ్లలలో కొన్నింటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. వేతనాల పెంపు ఒక్కటే మిగిలింది, సంక్రాంతి తరువాత..
దానిపైనా సానుకూల నిర్ణయం తీసుకుంటాం. 5 నుంచి బాలింతలకు కిట్లు ఇవ్వాలి సహకరించండి. సంక్రాంతి తరువాత.. మరోసారి చర్చిస్తాం. అంగన్ వాడీ యూనియన్ నేతలతో.. ప్రభుత్వ బృందం వీరికి జీతాలు పెంచిన మాట వాస్తవం కాదా, అంగన్వాడీ కార్యకర్తల జీతం 2018కు ముందు ఉన్న 7 వేల నుంచి రూ.11,500కు పెంచలేదా? మినీ అంగన్వాడీల జీతం రూ.4,500 నుంచి రూ.7వేలు చేయలేదా? ఎన్నికల వేళ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని మీలోనే కొంతమంది టీడీపీ, యెల్లొమీడియా శక్తులకు అమ్ముడిపోయి, మిమ్మల్ని రెచ్చగొడుతూ, మీకు లేనిపోని ఆశలు కల్పిస్తూ ఇలా ధర్నాలకు ఉసిగొల్పుతున్నారు.. ఈ ప్రభుత్వం అందరి మేలు కోరే ప్రభుత్వం అనేది మీరందరూ ఇన్నాళ్లు చూశారు. అదే నమ్మకంతో మన ప్రభుత్వనికి అండగా ఉండాలి అని మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాం అని ఎమ్మెల్యే అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా పల్నాడు జిల్లా దాచేపల్లి మునిసిపల్ కార్మికులు మోకాళ్ళ దండ వేసి నిరసన తెలిపారు. స్థానిక లైబ్రరీ సెంటర్ వద్ద టెంట్ వేసి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారం లోకి రాకముందు తమను శాస్విత ప్రాతిపదికన నియమిస్తామని హామీ ఇచ్చిందని కానీ అధికారం లోకి వచ్చి 5 వ ఏడు పూర్తి కావస్తున్నా హామీలు నెరవేర్చలేదని అన్నారు. హామీకి విరుద్ధంగా అప్కాస్ అనే శాస్విత కాంట్రాక్టు వ్యవస్థను తమ పైన రుద్దిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే తాము ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అప్పటి వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు.
బాపట్ల ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి ప్రయత్నించిన అంగన్వాడి కార్యకర్తలను భారీ పోలీసు బలగాలతో అడ్డుకుంటున్న బాపట్ల పోలీసులకు, అంగన్వాడీ కార్యకర్తలకు తోపులాట జరిగింది. ఉదయం మా ముందే బాపట్ల శాసనసభ్యులు కోనా రఘుపతి బయటికి వెళ్లారని, మమ్మల్ని చూసుకుంటూ వెళ్లారు గాని మమ్మల్ని ఏమాత్రం పలకరించి ఎందుకు వచ్చారని అడగలేదని అంటే అంగన్వాడీలు అంత తీసేసారా, ఎమ్మెల్యేకి అంత అహంకారం పనికిరాదని రాష్ట్రంలో వైసిపి శాసనసభ్యులు అందరూ ఇలాగే ప్రవర్తిస్తున్నారని, త్వరలోనే ముఖ్యమంత్రి జగన్కు, వైసీపీ ఎమ్మెల్యేలకు బుద్ధి చెబుతామని అంగన్వాడీలు హెచ్చరించారు.