పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్నంలోని కొత్త మార్కెట్ యార్డ్ ఎదురు నేషనల్ హైవే మీద గుంటూరు నుంచి వెళ్తున్న కారు, గణపవరంకు చెందిన వ్యక్తి మార్కెట్ యార్డ్ లో నుంచి కూరగాయలు కొనుక్కొని టీవీఎస్ ద్విచక్ర వాహనం మీద గణపవరం వెళుతుండగా గుంటూరు నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే గణపవరంకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. అలాగే పక్కన ఆగి ఉన్న స్కూటీని కూడా ఢీకొంది. స్కూటీ మీద ఉన్న వ్యక్తికి తీవ్రమైన గాయాలు అవటంతో వారి బంధువులు హుటాహుటిన వైద్యశాలకు తరలించారు.
Guntur
పల్నాడు జిల్లా గురజాలలో వైసీపీ నేతలు దాడి. గురజాల పట్టణంలో శ్రీ పాతపాటేశ్వర అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా టీడీపీ నాయకులు ఏర్పాటుచేసిన పాట కచేరీలు పై వైసిపి నాయకులు దాడి. బ్యానర్లు చించి దాడికి తెగపడ్డ వైసీపీ నాయకులు. సుమారు 300 మంది వైసిపి నాయకులు , కార్యకర్తలు కర్రాలతో దాడి. మీడియా ప్రతినిధులపై దాడికి తెగబడ్డ వైసిపి మూకలు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. ఇరువర్గాలని చెదరగొట్టిన పోలీసులు.
పల్నాడు జిల్లా, సత్తెనపల్లి ఐదు లాంతర్ల సెంటర్ వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి సత్తెనపల్లి టిడిపి ఇంఛార్జి కన్నా లక్ష్మీనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు వర్గాలకు అండగా ఈ రాష్ట్రంలో ఒక శక్తిగా ఎదిగిన వ్యక్తి రంగా. ఆయన ఆశయాలను వదిలేసి ఆయన పేరుతో రాజకీయం చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఖమ్మంలో కమ్యూనిస్టులు హైదరాబాద్ పార్టీ మీటింగ్ కి వెళ్ళవలసి ఉండగా పార్టీ జెండాలు పక్కన పడేసి రంగా మీటింగ్ కి వచ్చిన సందర్భం ఉంది. నేనొక్కడినే చేయాలి అనే సిద్ధాంతం ఏమిటి, ఎక్కడ మీకు పేటెంట్ రైట్ ఉంది రంగా వర్ధంతి చేసుకోవడానికన్నా. రంగా గారి పేరు మీద రాజకీయాలు చేయొద్దు. ఆయన ఆశయం కోసం పనిచేశాడు. రంగా గారి ఆశయాలు అనుగుణంగా జీవితాంతం పనిచేస్తామని తెలియజేస్తున్నాను అని చెప్పారు.
బాపట్లలో 15వ రోజు అంగన్వాడిలు రోడ్డుపై నల్ల బెలూన్లతో వారి నిరసనను తెలియజేసారు. సీఎం డౌన్ డౌన్ అన్న నినాదాలతో మాట తప్పను మడమ తిప్పను అన్న సీఎం మాట తప్పాడు. మనిషి ముఖం తిప్పాడు అనే నినాదాలతో రోడ్డుపై నిల్చోని అంగన్వాడీలు హోరెత్తించారు. బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 15వ రోజు అంగన్వాడీలు నల్ల బెలూన్లతో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసు నుండి పాత బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి నల్ల బెలూన్లు పాత బస్టాండ్ సెంటర్ లో వదిలి నిరసన తెలిపారు. లక్షపై చిలుకు ఉన్న అంగన్వాడీల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం అని వారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ 15 రోజుల నుండి మేము సమ్మెలు, దీక్షలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమకుట్టినట్లు అయినా లేదని, అంగన్వాడీల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి మాకెంతో బాధ కలిగిస్తుందని వారు అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడీల పట్ల దయ చూపి వారి డిమాండ్లను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగనవాడిలపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని వారన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడిల డిమాండ్లను పరిష్కరించాలని వారు అన్నారు.
ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు 26.12.23 మంగళవారం ఉదయం 11 గంటలకు బాపట్ల మున్సిపల్ హై స్కూల్ లో బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడుదాo ఆంధ్ర అనే కార్యక్రమం మంచి స్ఫూర్తితో కూడిన క్రీడాకారులకు మంచి నైపుణ్యం అందిస్తుందని కలెక్టర్ అన్నారు. మనం ఈ బిజీ కాలంలో మానసికంగా ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉంటామని, అలాంటి టైంలో ప్రతిరోజు ఏదో ఒక సమయం కేటాయించి క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ శారీరకంగా క్రీడలతో మానసిక ఉల్లాసం పొందచ్చని ఆయన అన్నారు. ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా రాష్ట్రవ్యాప్తంగా గుంటూరులో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని, ప్రతి ఒక్క క్రీడాకారుడు, విద్యార్థులు, విద్యార్థినిలు, యువకులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ముఖ్య మంత్రి ఆలోచన ధోరణికి అద్ధం పడుతుందని, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు, విద్యార్థినిలు, యువకులు లాప్టాప్లు సెల్ ఫోన్లతో బిజీ లైఫ్ లో ఉన్నారని గమనించి శారీరకంగా అందరూ కష్టపడితే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని ఈ అవకాశాన్ని స్కూలు, కాలేజీ విద్యార్థులు, విద్యార్థినిలు, యువకులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవించిన మహోన్నత వ్యక్తి పేదల హృదయాల్లో ఎప్పటికీ నిలిచే రూపం వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో ఎన్నార్టీ సెంటర్ నందు పార్టీ కార్యాలయంలో వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వంగవీటి మోహన్ రంగా జీవితం బడుగు బలహీన వర్గాలకే అంకితం అని ఆయన పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి పేదల గుండెల్లో చిరస్థాయిగా చేరగని ముద్ర వేసుకున్నారు. వంగవీటి పేద ప్రజల కోసం చేసే సేవలను చూసి కొంతమంది రాజకీయ దుండగులు ఓర్వలేక నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో వంగవీటికి ఎటువంటి భద్రతా లేని సమయంలో హత్యకు గురి చేశారు.
ఆడుదాం ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పండుగ వాతావరణంలో అడుదాం ఆంధ్ర క్రీడా సంబరాల నిర్వహణ జరుగుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేష్ నాయుడు అన్నారు. పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజేష్ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక జగనన్న ప్రభుత్వంలో రూపొందించామన్నారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరూ ఎదిగేలా జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ రూపొందించారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి లో వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి సందర్భంగా రంగ చిత్ర పటానికి, విగ్రహాలకు పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగాను హతమార్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని అందుకే టిడిపిని దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని ఆయన అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఎన్నోసార్లు టిడిపి ప్రభుత్వం రంగాను చంపిందని చంద్ర బాబే చంపాడన్నారు. చంద్రబాబు నన్ను కూడా చంపాలని చూసాడు కాని నన్ను చంపలేకపోయాడని నారాయణ అప్పట్లో అన్నారు. పదవే శాశ్వతమా, పదవి కోసం పాకులాడాలా, పదవి కోసం పాకులాడే వారిని ఈ సమాజం క్షమించకూడదని కన్నాని ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజశేఖర్ రెడ్డి వెంబడి నడిచాను ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంబడే నడిచాను అని అన్నారు. ఆరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఎవరైనా ఊహించారా. జగన్ ను జైల్లో పెడతానన్నారు అలాగే నన్ను కూడా జైల్లో పెడతారు అన్నారు. సిబిఐ కూడా నన్ను పిలిచింది అయినా నేను నమ్ముకున్న మనిషి కోసం సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్నాను.
ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ గుంటూరు జిల్లాలో స్టూడెంట్స్ కదం తొక్కారు. గుంటూరులో జగన్ పై పర్యటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నారు. సీఎంను కలవడానికి ర్యాలీ వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. సీఎం గో బ్యాక్ అంటూ విద్యార్థులు ర్యాలీలు చేశారు. నినాదాలు చేస్తున్న వారిని పోలీసులు స్టేషన్ కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్వహిస్తున్న “ఆడుదాం ఆంధ్ర” క్రీడా పోటీలను నేడు సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంబించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు శివారు నల్లపాడుకు సిఎం చేరుకుంటారు. ఒక ప్రైవేట్ స్కూల్లో ఆడుదాం ఆంధ్రా పోటీలను సిఎం జగన్ ప్రారంభిస్తారు. అనంతరం 15 వేల 4 గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో పోటీలు మొదలవుతాయి. డిసెంబర్ 26 నుంచి 2024 ఫిబ్రవరి 10వ తేదీ వరకు మొత్తం 47 రోజులపాటు ఐదుదశల్లో ఈ పోటీలు జరుగుతాయి. సిఎం జగన్ పర్యటన దృష్ట్యా భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
Read Also..
పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో వైసీపీ నాయకుల మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి కండువా కప్పుకున్న పెదకూరపాడు వైసీపీ బహిష్కరణ నేతలు, ఖండించిన క్రోసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈదా సాంబి రెడ్డి. వైసీపీ పార్టీలో నాయకుల పేరుతో అవినీతికి పాల్పడుతున్న వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తే వాళ్ళు టిడిపిలోకి ఆహ్వానిస్తున్న చంద్రబాబు ఇంకెంత అవినీతిపరుడో అర్ధం చేసుకోవాలి. పెదకూరపాడు నియోజకవర్గంలో టిడిపికి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో ఇప్పటివరకు ఖరారు కాలేదు. మా నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గాని, అతని కుమారుడు లోకేష్ గాని, ఎవరు అభ్యర్థిగా వచ్చినా కూడా శంకర్రావు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం తథ్యం అని వారు తెగేసి చెప్పారు.