తన మాటను కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాలుగా ఒక రైతు సమస్యను పరిష్కరించాలని, రెవిన్యూ అధికారులను చెప్పినా పట్టించుకోక పోవడంపై ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. గత కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి – ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. నియోజకవర్గ ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే మాట వింటూ.. ఎమ్మెల్సీ జంగా.. పనులు చేయమని అధికారులను ఆదేశించినా కూడా పనులు జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక ప్రజాప్రతినిధి స్వయంగా చెప్పినా అధికారులు పనిచేయడం లేదంటే.. ఇక సామాన్య ప్రజల మాటేమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
Guntur
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సరే కానీ ఆట స్థలాలు ఎక్కడ అంటూ గుంటూరు తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి డిమాండ్ చేశారు. గుంటూరు లో ఉన్న విద్యార్థి సంఘాలు కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియం ను సందర్శన చేశారు. స్టేడియం అధ్వాన్నంగా తయారైందని ఆవేదన వ్యక్తంచేశారు. స్టేడియంలో మొలచిన పిచ్చి చెట్లని వారు తొలగించారు. స్టేడియం లో విద్యార్థుల కి మెరుగైన వసతులు ,సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో ఆట స్థలాల పరిస్తితి ని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ది కోసమే ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తుందని మండి పడ్డారు.
పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురిసౌత్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాగరమాత దేవాలయం లో క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ విచారణ గురువులు పామిశెట్టి జోసెఫ్ బాలసాగర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం దివ్యబలి పూజ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పశువులపాక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా విచారణ గురువులు జోసెఫ్ బాలసాగర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శణీయమన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా మన మధ్య జన్మించిన రోజే క్రిస్మస్ పర్వదినమని అన్నారు. క్రీస్తు సందేశాలను సమస్త మానవాళి ఆచరించాలని సూచించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సరే కానీ ఆట స్థలాలు ఎక్కడ అంటూ గుంటూరు తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి డిమాండ్ చేశారు. గుంటూరులో ఉన్న విద్యార్థి సంఘాలు కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియంను సందర్శన చేశారు. స్టేడియం అధ్వాన్నంగా తయారైంది అని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేడియంలో మొలచిన పిచ్చి చెట్లను వారు తొలగించి విద్యార్థులకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో ఆట స్థలాల పరిస్తితిని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ది కోసమే ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తుందని మండి పడ్డారు.
గుంటూరు జిల్లాలో 26వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సిఎం పాల్గొనే లయోలా స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వం తలపెట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని సిఎం జగన్ ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాలో లక్షా 25 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులు రాష్ట్రస్తాయిలో పాల్గొంటారని తెలిపారు. సీఎం పర్యటన నిమిత్తం భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశామని ఎస్పీ అరీఫ్ హఫీజ్ అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
బాపట్ల జిల్లా కంకటపాలెం గ్రామంలోని పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి చోరీ చేశారు. దేవస్థానంలోని హుండీ తో పాటు అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలు దొంగతనానికి గురి అయినట్లు ఆలయ పూజారి బాపట్ల శేషగిరిరావు తెలిపారు.
సోమవారం వేకువజామున ఆలయం తెరవడానికి వచ్చిన పూజారి కి తాళాలు పగలగొట్టి ఉండటం తో గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చారు. గ్రామ పెద్దలతో కలిసి పూజారి ఆలయం లోపలికి ప్రవేశించి దొంగతనానికి గురి అయిన వాటిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆలయంలో అమ్మవారి చీరెలు అమ్మగా వచ్చిన 15000 రూపాయలు కూడా హుండీలోనే వేశామని పూజారి చెబుతున్నారు. అమ్మవారి బంగారు కాసుల పేరుతో పాటు కళ్ళు, చెవులు మిగిలిన ఆభరణాలు, ఛటారితో సహా అపహరణ కు గురయ్యాయన్నారు. షుమారు పది లక్షల రూపాయలకు పైగా ఆభరణాల విలువ ఉంటుంది అంటున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగలను గుర్తించడం పోలీసులకు సవాలుగా ఉంది.
మంత్రి అంబటి రాంబాబు కి మాజీ మంత్రి ఆలపాటి రాజా కౌంటర్ ఇచ్చారు. శవాలను గుట్టలుగా వేసుకొని పోస్టు మార్టం మీరు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. సకాలంలో కాల్వ తవ్వలేని, మురుగు కాల్వ బాగుచేయలేని మంత్రి అంబటి రాంబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోనే కాదు ఎక్కడ కూడా రాజకీయ మనుగడ లేని వ్యక్తి అంబటి రాంబాబు అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అంటూ మండి పడ్డారు. సంక్షేమ ముసుగులో పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారని ఆరోపణలు చేశారు. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి మద్యపానాన్ని నిషేదిస్తాను అన్న మాట తప్పారు అంటూ ఎద్దేవా చేశారు.
బాపట్ల జిల్లా కర్లపాలెం వైసీపీలో గందరగోళ వాతావరణం నెలకొంది. వైసీపీకి గుడ్ బాయ్ చెప్పి కర్లపాలెం మైనార్టీ సోదరులు టిడిపి పార్టీలో చేరుతున్నారు. వీరిని తమ పార్టీలోకి టీడీపీ నాయకుడు నరేంద్ర వర్మ సాదరంగా ఆహ్వానించారు. బాపట్ల లో టిడిపి అధినాయకుడి ఆశీస్సుల కోసం నియోజకవర్గంలోని అధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటర్ మహాసేయులు బారులు తీరుతున్నారు. నాడు గ్రాండ్ క్రిస్మస్ వేడుకలకు నియోజకవర్గంలోని దళిత క్రైస్తవ సోదర సోదరీమణులు తండోపతండాలుగా తరలివచ్చారు. నేడు క్రిస్మస్ పర్వదినాన వైసీపీని వీడి అచంచలమైన విశ్వాసంతో కర్లపాలెం కు చెందిన 200 మంది మైనారిటీ సోదర సోదరీమణులు నరేంద్ర వర్మ చెంత చేరారు. రోజురోజుకు నరేంద్ర వర్మ కు పెరుగుతున్న మద్దతు, సర్వమత ప్రజల ఆదరాభిమానాలు, పార్టీ అధినాయకుడి భవిష్యత్తుకు గ్యారెంటీ తమకు ప్రేరణ కలిగించి నేడు వైసీపీని వీడి టిడిపి పార్టీలో చేరామని మైనారిటీ సోదర సోదరీమణులు ముక్తకంఠంతో తెలిపారు. నాడు ఒక్క ఛాన్స్ అని జగన్ కు ఓటేస్తే నట్టేట ముంచేసాడని నేడు వైసిపి పాపం పండిందని ప్రజలలో అసహనం పెరిగి విసిగి వేసారి పోయారని అందరి చూపు టిడిపి వైపేనని నరేంద్ర వర్మ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
బాపట్ల జిల్లాలో ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 13వ రోజు అంగన్వాడీలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. లక్షపై చిలుకు ఉన్న అంగన్వాడీల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ 13 రోజుల నుండి మేము సమ్మెలు దీక్షలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమకుట్టినట్లు అయినా లేదని, అంగన్వాడీల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి, మాకెంతో బాధ కలిగిస్తుందని వారు అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడీ పట్ల దయచూపి అంగన్వాడి ల డిమాండ్లను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఉధృతం చేస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగనవాడిలపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని వారన్నారు, ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడి డిమాండ్లను పరిష్కరించాలని వారు అన్నారు.
వేమూరు మండలం జంపని గ్రామంలో క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన సెమి క్రిస్మస్ వేడుకలలో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, పెదలకు దుప్పట్లు పంపిణి చేశారు. క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ.. నీ వలే నీ పొరుగువారిని ప్రేమించుము శత్రువును కూడా ప్రేమించాలి అని బైబిల్ చెపుతోంది అన్నారు. కానీ మిత్రుడిని కూడా శత్రువుగా చూసే పరిస్థితి నేడు ఉంది అని వివరించారు. మానవ ప్రయత్నానికి.. దేవుని అశీస్సులు కావాలి, అప్పుడే సంకల్పం నెరవేరుతుందని తెలిపారు. సమస్త మానవాళి రక్షణ కోసం దేవుడు ఏసు మానవ రూపంలో వచ్చారని, రాష్ట్రానికి మంచి జరగాలి అని చర్చిల్లో ప్రార్థనలు చేయండి అని విజ్ఞప్తి చేశారు.