పల్నాడు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యువగళం పాదయాత్ర టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపింది అన్నారు. పాదయాత్రలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకి నాయకులకు ధన్యవాదాలు అని, నరసరావుపేటలో టీడీపీ గెలుపు కోసం నాలుగున్నర ఏళ్లుగా పని చేస్తున్నాను అన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎస్సి, ఎస్టీ, బీసీలు బ్రహ్మరథం పడతారు అని, వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది అన్నారు. యువగళం విజయంతో వైసీపీ నేతలు వణికిపోతున్నారు అని తెలియజేశారు.
Guntur
వైసిపి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన దాడులు నిర్వహించిన పారిపోమని టిడిపి ఓట్లను తొలగించడం, ఓట్లు వేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నించడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. పల్నాటి ప్రజలు టిడిపి పార్టీని ఆదరించారని ప్రజలు కష్టాల్లో ఉన్నారని వారికి టిడిపి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఇంకొక మూడు నెలలు ఓపిక పట్టండని నష్టపడ్డ ప్రజలకు, ప్రతి టిడిపి కార్యకర్తకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని అన్నారు. ఓటమి భయం వైసిపి పార్టీని వెంటాడుతుందని వ్యవస్థలను వెంటబెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో టిడిపి జనసేన సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయమని ప్రజలు, కార్యకర్తలు భయపడవద్దని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసిన కూడా లోకేష్ పాదయాత్ర బ్రహ్మాండంగా జరిగిందని అది జీర్ణించుకోలేని వైసిపి ప్రభుత్వం వారు పాదయాత్ర మొదలు పెట్టిన దగ్గర నుండి ఎద్దేవా చేస్తూనే ఉన్నారని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు తమ ఓటు హక్కుతో వైసిపి ప్రభుత్వంకు ఓటమిని 70mm లో సినిమా చూపిస్తారని ఆయన అన్నారు.
బాపట్ల పట్టణము 33వ వార్డులో గత 70 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి స్థానికులతో ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్థలం అని వారిని ఖాళీ చేయాలనీ చెప్పటం తో అక్కడి ప్రజలకు ఏంచెయ్యాలో అర్ధం కావడం లేదు. ప్రజల సమస్యను తెలుసుకున్న వేగేశన నరేంద్ర వర్మ వారికీ ధైర్యం చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకువెళ్తాను అని హామీ ఇచ్చారు. వారు నివాసం ఉంటున్న స్థలాలకు నివేశన పట్టాలు ఇచ్చి మీకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు.
లక్ష పైచిలుకు ఉన్న అంగన్వాడీల పట్ల ఎందుకంత నిర్లక్ష్యం.. అంగన్వాడీలను విమర్శ చేసే ప్రతి ఒక్కరి ఇంట్లో మహిళలలు ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకోండి.. జగన్మోహన్రెడ్డి కోసం నాడు గెలిపించిన వారిలో మేము కూడా ఉన్నాము.. ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమం చేస్తుంటే పార్టీల రంగు పులమటం ఎంత వరకో మీ విజ్ఞతికే వదిలేస్తున్నాం.. గౌరవ వేతనం కోసం మా పోరాటం కాదు.. కనీస వేతనంమే మా డిమాండ్.. మాటలు చెప్పే ఆలోచనలు వద్దు, ఆచరణలో చూపండి. నాడు మీరు చెప్పిన మాటలకు కట్టుబడమనేదే మా విజ్ఞప్తి.. మాటలు జారే ముందు మీ నాయకుడు చేసిన వాగ్దానంపై ప్రశ్నించండి.. బాపట్లలో 11వ రోజు దీక్ష ఐసిడిఎస్ ప్రాజెక్టు నుండి ర్యాలీగా బయలుదేరి, బాపట్ల పాత బస్టాండ్ లో మానవహారం గా ఏర్పడి రోడ్డుపై నిరసన తెలిపిన అంగన్వాడీలు.. బెదిరించాల్సిన అవసరం మాకు లేదు. న్యాయమైన సమస్యలపై మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాము.. ఈ సందర్భంగా అంగన్వాడీలకు పోలీసులకు తోపులాట జరిగింది. కాసేపు బాపట్ల పాత బస్టాండ్ సెంటర్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం అంగన్వాడీలు ధర్నా విరమించి ఐసిడిఎస్ ప్రాజెక్టు బయలుదేరి వెళ్లారు.
పల్నాడు జిల్లా.. నరసరావుపేటలో విజేత సినిమా థియేటర్లో సందడి నెలకొంది. హీరో ప్రభాస్ నటించిన సలార్ మూవీ సక్సెస్ సందర్భంగా, ప్రభాస్ అభిమానులు థియేటర్లలో సందడి చేశారు. సలార్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి, టపాసులు కాల్చారు. హీరో ప్రభాస్ అభిమానులు మాట్లాడుతూ… మూడేళ్ల తర్వాత మాకు తిరణాల వచ్చినట్లుగా ఉంది అన్నారు. మూడు సినిమాలు ప్లాపైన, ఈ ఒక్క సినిమాతో ఊపిరి పీల్చుకున్నాం అన్నారు. ఇక నుంచి మా హీరో ప్రభాస్ తీసే సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్టు కావాలని ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున కోరుకుంటున్నామని తెలియజేశారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక రామిరెడ్డిపేటలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన నవవధువు చల్లా శిల్ప(19), నవ వధువు శిల్ప చిత్తూరు జిల్లా, డెక్కలి మండలం వెమ్ములూరు గ్రామం.. భర్త వెంకటేష్ ది నెల్లూరు జిల్లా వెంకటగిరి, వెంకటేష్ కి నరసరావుపేటలో ఉద్యోగ రీత్యా భార్యాభర్తలు ఉంటున్నారు. మృతురాలి బావ శంకరయ్య మాట్లాడుతూ.. శిల్పాకి రెండు నెలల క్రితమే వివాహం జరిగింది అని అన్నారు. పెళ్లైన ఐదు రోజులకే నరసరావుపేటకి వచ్చింది అని, పెళ్లైన కొన్ని రోజులకే నాకు శిల్ప భర్త వెంకటేష్ ఫోన్ చేసి, మీ అమ్మాయి వేరే వ్యక్తితో మాట్లాడుతుందని, ఆమే ప్రవర్తన నాకు నచ్చడం లేదని, మీరు వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అని అన్నాడు. నిన్న సాయంత్రం ఐదు గంటలకు శిల్ప భర్త వెంకటేష్ ఫోన్ చేసి, మీ అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది అని చెప్పారు అన్నారు. ఇంత లొనే ఎం జరిగిందో అర్థం కావడం లేదని, మాకు భర్త వెంకటేష్ మీదే అనుమానం కలుగుతోందని ఆరోపణ చేశారు. పోలీసులు కేసుని సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరారు.
యువగళం పాదయాత్ర సభ దిగ్విజయం అయిన సందర్భంగా టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ నవశకానికి నాంది పలికిందన్నారు. వైసిపి ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలుగజేసిన ఈరోజు యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయిందని ఆయన అన్నారు. యువగళం పాదయాత్ర లో ప్రతి 100 కిలోమీటర్ల చొప్పున ఒక హామీని శిలాపలక రూపంలో వేశారు అది అక్షరాల నిర్వహించే బాధ్యత టిడిపి ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. 92 నియోజకవర్గాలలో 3,152 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన నారా లోకేష్ గారికి అభినందనలు తెలిపారు. యువగళం పాదయాత్ర లో వైసిపి చేసిన అరాచకాలను, అసమర్ధ పాలన గురించి నారా లోకేష్ ప్రజలకు తెలియజేశారు. అలాగే ప్రతి గ్రామంలో ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశలో నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. బహిరంగ సభకు హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్, ఐదు లక్షల మంది ప్రజలు విచ్చేసి ఈ సభను విజయవంతం చేశారు. వీళ్ళందర్నీ ఓకే వేదిక పైన చూడడంతో జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టట్లేదు అని ఆయన ఎద్దేవాచేశారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ మహమ్మద్ నజీర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న విజయనగరం జిల్లాలో జరిగినటువంటి విజయోత్సవ సభ ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశలకు ఒక నవశకంగా మారినటువంటి పరిస్థితులను చూసాం. రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ సమావేశాలకు రానటువంటి విధంగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ప్రాంతం నుండి అశేష ప్రజానికం విజయనగరం వైపు రావడంతో జన సముద్రం గా మారినటువంటి పరిస్థితులు కనిపించాయని మహమ్మద్ నసీర్ తెలిపారు. తెలుగుదేశం వీర సైనికులు, జనసేన జన సైనికులు కదిలి వచ్చారని అందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబునాయుడు గారు మరోపక్క జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ గారు పాల్గొన్నారు. యువగలం రథసారథి అయిన నారా లోకేష్ గారు చేపట్టినటువంటి దాదాపు 226 రోజుల సుదీర్ఘ పాదయాత్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 97 నియోజకవర్గాలు దాదాపు 2100 గ్రామాలను ఆయన సందర్శించారు. ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ప్రజలు పడుతున్న ఇబ్బందులు కనుక్కొని వారికి భరోసా కల్పించేటువంటి కార్యక్రమం చేశారని ఆయన అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం తను నిస్వార్ధంగా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని బలపరిచేటువంటి కార్యక్రమం ఎందుకు చేశారని వివరించినటువంటి తీరు అద్భుతం అన్నారు. సభకు వచ్చిన జన సంద్రాన్ని చూసి వైసీపీ మంత్రులకు, జగన్ మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు. మంత్రి రోజా పవిత్రమైనటువంటి గుడిలో లోకేష్ గారి మీద వ్యంగంగా మాట్లాడడం సరికాదన్నారు. రోజా గారికి రోజులు దగ్గరపడ్డాయి ఆమె మంత్రిగా ప్రజలకు ఏం సేవ చేసిందో ఒక్కసారి చెప్పాలని అన్నారు. అలాగే వెల్లంపల్లి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఈరోజు లోకేష్, పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో ఏ విధమైనటువంటి స్పందన వస్తోందో ప్రజలందరూ ఆలోచించాలని, పరదాలు కట్టుకుని తిరిగేటటువంటి దౌర్భాగ్య స్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయారని తెలిపారు. ప్రజల్లో గుండె ధైర్యం కలిగిస్తూ ముందుకు సాగేటువంటి నాయకత్వం నారా లోకేష్ గారిది అందుకని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, జనసేన సైనికులు గాని మన అందరి నాయకుల సమక్షంలో రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ మహమ్మద్ నసీర్ తెలియజేశారు.
గుంటూరు తూర్పు నియోజక వర్గంలో వైసీపీ కొత్త పుంతలు తొక్కుతోంది. స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా వుండగానే ఎమ్మెల్యే అభ్యర్ధి నూరి ఫాతిమా అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డికు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గుంటూరు పట్టణం లో హల్ చల్ చేస్తున్నాయి. ఆర్టీసి బస్ స్టాండ్, జిన్నా టవర్, నాజ్ సెంటర్, పొన్నూరు రోడ్డులో అందరినీ హార్డింగ్ లు వెలిశాయి. దీంతో పాటు రోడ్డు ఇరువైపులా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అధిష్టానం ప్రకటన చేయకముందే ఇలా ప్రకటించుకోవడం నగరవాసుల్లో ఆశ్చర్యం కలిగిస్తుంది.
Read Also..
బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్డులో హర్ష ఎంటర్టైన్మెంట్, పిక్చర్ టైం వారి బెలూన్ థియేటర్ను ఈరోజు బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని 120 సీట్ల సామర్థ్యం గల బెలూన్ థియేటర్ బాపట్ల లో పెట్టడం చాలా సంతోషదాయకం అని అన్నారు. ఈ థియేటర్ అత్యధిక టెక్నాలజీతో పనిచేస్తుందని ఇలాంటి టెక్నాలజీ గల థియేటర్లు మరెన్నో బాపట్ల జిల్లాలో రావాలని ఆయన అన్నారు. థియేటర్ యజమాని కొల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో వేరే రాష్ట్రాల్లో బెలూన్ థియేటర్లు చూసి మాకు కూడా బాపట్ల జిల్లా కొత్తగా వచ్చిన తరుణంలో పర్యాటకులు అత్యధిక సంఖ్యలో పాల్గొనే, సూర్యలంక రోడ్డులోని మెయిన్ రోడ్డుకు ఆనుకొని మా సొంత స్థలంలో థియేటర్ పెడితే బాగుంటుందని, ఆ థియేటర్ కూడా కొత్త టెక్నాలజీతో బెలూన్ థియేటర్ పెట్టాలని మేము అందరి సహకారంతో బెలూన్ థియేటర్ బాపట్లలో పెట్టామని, ఈ బెలూన్ థియేటర్ను బాపట్లలోని ప్రేక్షకులందరూ ఆదరించాలని ఆయన అన్నారు.