తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టేవరకు తన యుద్ధం ఆగదన్నారు టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి నారా లోకేష్. యువగళం-నవశకం సభలో మాట్లాడుతూ ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుందని రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవమవుతుందని ఆయన అభివర్ణించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ దెబ్బతీశారని మూడు నెలల్లో ప్రజాస్వామ్యం పవర్ ఎంటో చూపిస్తామన్నారు.
Guntur
గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గంలోని వైసీపీ నేతల్లో కలవరం నెలకొంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజినికి ఇవ్వడంతో గుంటూరు తూర్పు లో మహిళకి సీటు ఇవ్వడం కష్టమేనని చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే తానే అంటూ ప్రచారంలో దూసుకుపోతుంది ఎమ్మెల్యే ముస్తఫా కూతురు నూరి ఫాతిమా. ఫ్లెక్సీలు ఏర్పటు చేసి తానే ఎమ్మెల్యేనంటూ సమావేశాలను నిర్వహించారు. అయితే చివరి నిమిషంలో సీటు మారే అవకాశం ఉండటంతో కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు. దీంతో ఎమ్మెల్యే ముస్తఫా రంగంలోకి దిగాడు. తాడేపల్లిలో సీఎం జగన్ ని ముస్తఫా కలిసే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది.
Read Also..
Read Also..
పల్నాడు జిల్లా, చిలకలూరిపేట సంక్షేమ సారథి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజల అభ్యున్నత కోసం అడుగడుగునా పరితపిస్తూ నవరత్న పథకాలతోటే పేదల తలరాత మార్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను, చిలకలూరిపేట నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో పట్టణంలోని వైస్సార్ పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం రాజేష్ నాయుడు మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని చిలకలూరిపేట నియోజకవర్గంలో కోలాహాలంగా ఏర్పాట్లు నిర్వహించామని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా పట్టణంలోని పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు నిర్వహించామన్నారు. అంతేకాకుండా సెమీ క్రిస్మస్ వేడుకలు కూడా ఎన్నార్టీ రోడ్డు లో గల పాత పశువుల సంత ప్రక్కన గోల్కొండ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని మేము ఇచ్చే ప్రేమ విందును స్వీకరించాలని కోరారు.
దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో రైతు ఆత్మహత్య. గడ్డి మందు తాగి రైతు కిశోర్‌బాబు(48) ఆత్మహత్య. తుపాను వల్ల ఐదెకరాల మినుము పంట నష్టపోయిన కిశోర్. అప్పుల బాధతో నిన్న రైతు కిశోర్‌బాబు ఆత్మహత్యాయత్నం. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన కిశోర్. రైతులు, రైతుకూలీల ఆత్మహత్యల ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర (3,927 బలవన్మరణాలు) మొదటి స్థానంలో ఉంది. ఈ జాబితాలతో 628 ఆత్మహత్యలతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో, 499 ఆత్మహత్యలతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నాయి.
గుంటూరు పట్టణంలో పత్తిపాడు నియోజక వర్గ వైసీపీ నాయకులు సమావేశం, నాయకులు సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ కి కార్యకర్తలే బలం. కార్యకర్తలే లేకుంటే పార్టీలే ఉండవు. నాయకుల మధ్య విభేదాల ఉంటే వాటిని పక్కన పెట్టి గెలుపు కోసం కృషి చేయాలి. గతంలో ఇక్కడ సుచరిత గారిని గెలిపించిన విధంగా ఇంచార్జి కిరణ్ గెలిపించాలని కోరుతున్నా. పార్టీ కోసం గ్రామ గ్రామాన ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు గురించి చెప్పాలి. ప్రభుత్వం బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది. రాష్ట్రంలో కార్యకర్తలకు గుర్తింపు తెచ్చిన ఘనత వైసీపీ దే అని వెల్లడించారు.
బాపట్ల జిల్లా రేపల్లెలో అంగన్వాడిలు చెవిలో పూలు పెట్టుకోని నిరసన తెలియజేయడం జరిగింది. 9వ రోజు సమ్మె సందర్భంగా సమ్మె శిబిరంలో చెవిలో పూలు పెట్టుకోని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జే. ఝాన్సీ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని రోడ్డున పడేసిన నేపథ్యంలో డబ్బులు లేవని జీతాలు పెంచలేమని చెవిలో పూలు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. కనీస వేతనాలు అమలు చేయమంటాం, పెన్షన్ ఇవ్వమనటం, రిటైర్డ్ బెనిఫిట్ ఇవ్వమనటం, నేరం అన్నట్లు ప్రచారం నిర్వహిస్తామన్నారు. మేము అడిగేది న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం పట్టు విడవకుండా నిర్బంధాన్ని ప్రయోగిస్తుందన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వం దిగిరాక తప్పదని అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్. మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఆందోళన కొనసాగించినప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది రాబోయే కాలంలో కలెక్టరేట్లు ముట్టడిస్తామని, ఛలో విజయవాడ నిర్వహిస్తామని ప్రభుత్వం స్పందించాలని అంగన్వాడీలను భయభ్రాంతులను చేయటం విరమించుకోవాలని అన్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం వద్ద సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు ధర్నా నిర్వహించారు. ఎన్నో సంవత్సరాలుగా ఇళ్లు వేసుకొని నివాసం ఉంటున్న పేదలకు ప్రభుత్వం వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికార యంత్రాంగం, అధికార పార్టీలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. 30 వేల మంది ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్నారని, వారిలో పదివేల మందికి మాత్రమే ఇచ్చారన్నారు. మరో 20 వేల మంది ఇళ్ల పట్టాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
Read Also..
Read Also..
అమరావతి, ఉదయం 11 గంటలకు జగనన్న విదేశీ విద్యాదీవెన,జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పధకాల నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్. విదేశీ విద్యా దీవెన కింద విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.60 కోట్లు విడుదల. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత ఉత్తీర్ణత సాధించిన 95 మందికి,తిరిగి మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా కోటి రూపాయలు విడుదల. మొత్తం 42.60 కోట్లను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్..
గుంటూరు.. పేదలకు సేవ చేయడానికి వైఎస్సార్ కంటే 100 అడుగులు సీఎం జగన్ ముందు ఉంటున్నారు. గుంటూరు పట్టణంలో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు మంత్రి రజినీ అందజేశారు. పేదలకు మెరుగైన వైద్యం కోసం 5 లక్షల నుంచి 25లక్షల రూపాయలు మేర వ్యయ పరిమితిని పెంచారు. రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ కోసం ప్రభుత్వం 600కోట్లు ఖర్చు చేస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల ను సైతం కార్పొరేటర్ ఆసుపత్రుల మాదిరిగా తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిదే. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం, గత ప్రభుత్వ హయాంలో మెరుగైన వసతులు లేక పేదలు ఇబ్బందులకు గురి అయ్యారు.
బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడీలు చిలక జోస్యం చెప్పించారు. బాపట్ల ఐసిడిఎస్ ఆఫీస్ ముందు బైఠాయించి అంగన్వాడీలు, టీచర్లు, ఆయాల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఎనిమిదో రోజు సమ్మె సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చిలక జోస్యం చెప్పించి అంగన్వాడీలు వినూత్న ధర్నా నిర్వహించారు. చిలక జోస్యం లో ఇకనైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి అంగన్వాడీల డిమాండ్లను నెరవేర్చాలని చిలక యజమానిచేత చెప్పించారు. ఈ చిలక జోస్యం కార్యక్రమాన్ని దారిన పోయే ప్రజలు, అధికారులు, స్కూలు పిల్లలు, కాలేజీ విద్యార్థులు విద్యార్ధినిలను విశేషంగా ఆకర్షించింది. ఐదు లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ అమలు చేయాలని నినాదాలు చేసారు. అనంతరం రోడ్డుపై మోకాళ్ళ మీద కూర్చొని అంగన్వాడీలు నిరసన తెలిపారు. తల్లుల తకాల సేకరణ చేపట్టిన అంగన్వాడీలకు మద్దతుగా నిలిచిన సిఐటియు నాయకులు.