మచిలీపట్నం జనశక్తి నగర్ లో పామర్తి సునీల్ కుమార్ (32) యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డారు. మైలవరంలోని లక్కిరెడ్డి బాలి రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న పామర్తి సునీల్ కుమార్ ఇంజనీరింగ్ చదువుకున్న యువకుడి కి పెళ్లి జరిగి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. ఆత్మహత్యకు కుటుంబ కలహాల లేక భార్యాభర్తల మధ్య విభేదాల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Krishana
కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోకి చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్. కలపర్రు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపైకి వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు. చంద్రబాబును చూడనీయకపోతే కాన్వాయ్ ని కదలనీయబోమంటూ అడ్డుపడుతున్న ప్రజలు. రాత్రి 11.30గంటల ప్రాంతంలోనూ జాతీయరహదారిపై వేచిచూస్తున్న మహిళలు, అభిమానులు. రాజమండ్రి నుంచి 7గంటలకు పైగా సాగుతున్న చంద్రబాబునాయుడు ప్రయాణం. భారీగా తరలివస్తున్న ప్రజలు, అభిమానులు, కార్యకర్తలతో జాతీయరహదారిపై గంటకు 20కిలోమీటర్లు కూడా సాగని కాన్వాయ్. వేలాదిగా తరలివస్తున్న ప్రజలను అదుపుచేయలేక ఆపసోపాలు పడుతున్న పోలీసులు.
ఎన్టీఆర్ కృష్ణా జిల్లా చిన్న ముత్తెవి గ్రామానికి చెందిన గారపాటి జయప్రకాశ్ 3 రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయుష్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అవ్వడంతో కుటుంబసభ్యులు అవయవ దానానికి అంగీకరించారు. ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గుండెను ఆయుష్ హాస్పిటల్ నుండి గన్నవరం విమానాశ్రయానికి తరలించారు.గన్నవరం నుండి తిరుపతి లోని పద్మావతి హాస్పిటల్ కు తరలించారు.





Total views : 81798