Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Andhra Pradesh బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో అల్పపీడనం

by Satya
low pressure

ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్‌ నికోబార్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. క్రమంగా ఇది వాయువ్యదిశగా కదులుతూ పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. నవంబర్‌ 15 కల్లా పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండగా మారే అవకాశం కనిపిస్తోంది. వాయవ్య దిశగా పయనించి రేపటికి తీవ్రవాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతంపై కనిపించనుంది. కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం నాటికి ఇది ఉత్తర- ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరానికి చేరుకుంటుంది. కోస్తాంధ్ర తీరంలో వర్షాల నేపథ్యంలో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

Advertisements

You may also like

Our Visitor

014821
Total views : 81088

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.