పవన్-లోకేష్ సమావేశాన్ని తేలికగా కొట్టి పారేసింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అసలు రెండు తెలుగు రాష్ట్రాలకు అసలైన తెగులు తెలుగుదేశం పార్టీయే అన్నారు ఆ పార్టీ నేత, మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలు అశ్చర్యకరమైనవేమీ కావన్నారు. చంద్రబాబుకు బీటీమ్ లాంటి పవన్ కొత్త ప్యాకేజీ మాట్లాడుకున్నారని తెలిపారు. వారి మధ్య సాగిన చర్చ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, తెలుగుదేశం పరిరక్షణ కోసమే వారి చర్చలు అంటూ విమర్శలు గుప్పించారు.
Andhra Pradesh
విజయదశమి రోజు తాము సమావేశం కావడం ఏపీకి మేలు చేస్తుందని నారా లోకేశ్ అన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి వెళ్లాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామన్నారు. వైసీపీ పాలనలో బీసీ వర్గాలను వేధిస్తున్నారని ఆరోపించారు. బీసీలకు వాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారని విమర్శించారు. ఎస్సీలకు రావాల్సిన 26 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారన్న లోకేష్… వైసీపీ నేతల వేధింపులతో ముస్లింలు ఆత్మహత్య చేసుకున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని లోకేశ్ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని పలురకాలుగా వేధిస్తున్నారని మండిపడ్డారు
మద్యనిషేధం చేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్ముతోందన్నారు పవన్ కళ్యాణ్. ఏపీకి వైసీపీ అనే తెగులు పట్టుకుందన్నారు. ఆ తెగులు పోవాలంటే.. టీడీపీ – జనసేన వ్యాక్సిన్ అవసరమని చెప్పారు. చంద్రబాబును అక్రమంగా అకారణంగా జైల్లో పెట్టారని, సాంకేతిక అంశాల పేరుతో బెయిల్ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు మద్దతిచ్చేందుకే రాజమహేంద్రవరంలో భేటీ అయ్యామన్నారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకే కలిశామని చెప్పారు. ఉమ్మడి మ్యానిఫెస్టో ఎలా ఉండాలనే దానిపై చర్చించామన్నారు. టీడీపీ -జనసేన ఎలా కలిసి పని చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించామని, త్వరలో కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తామని పవన్ అన్నారు.
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీకి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడేందుకు ఏర్పాటైన టీడీపీ-జనసేన ఉమ్మడి సమన్వయ కమిటీ సరికొత్త వ్యూహాలను ఖరారు చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు హోటల్లో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు రెండు పార్టీల కమిటీ నేతలు భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనే విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలు ఖరారు చేశారు. చంద్రబాబు అరెస్టు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు.
తిరుపతి బహిరంగసభ ( Public Meeting ) :
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) తిరుపతి చేరుకున్నారు. ఆమె నేడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తమ స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. నారావారిపల్లెలో తమ కులదేవతకు పూజలు చేయనున్నారు. నారా భువనేశ్వరి రేపటి నుంచి ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు..
Follow us on : Facebook, Instagram & YouTube.
చంద్రబాబు అరెస్ట్ వార్త విని ఆవేదనతో చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఇక, రేపు నారావారిపల్లి నుంచి నిజం గెలవాలి బస్సు యాత్ర స్టార్ట్ కానుంది. ఐతేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో పల్లె ప్రజలతో నారా భువనేశ్వరి సహపంక్తి భోజనం చేయనున్నారు. చంద్రగిరి మండలంలోని అగరాల బహిరంగసభలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఆమె మాట్లాడనున్నారు. అనంతరం తిరుపతిలోను భువనేశ్వరి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన-టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులకు సంబంధించి ఈనెల 26న తిరుపతిలో వారిని పరామర్శించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై తిరుపతిలో జరిగే బహిరంగసభలోను ఆమె ప్రసంగిస్తారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రాత్రి అశ్వ వాహనం తిరుమాడవీధులో అశ్వ వాహనం పై శ్రీమలయప్పస్వామి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమల నుండి ప్రత్యక్ష ప్రసారం కల్కి అలంకరణలో కలియుగ వైకుంఠంలో శ్రీనివాసుడు ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి ఇంద్రియ నిగ్రహం వున్న చోటే ఆద్యాత్మిక వికాసం ఇంద్రియాలను జయించిన వారే భగవంతుని చేరుతారు పార్దసారధిగా భగవద్గీత బోధించిన శ్రీకృష్ణుడు ఇంద్రియాలనే గుర్రాలను పూన్చిన రధమే మన దేహం ఆ రధాన్ని నడిపించే పరమాత్మే నేడు అశ్వ వాహనుడు అశ్వ వాహనంపై స్వామి తెలుపుతున్నది ఇంద్రియ నిగ్రహం కల్కి అవతారంలో… అశ్వవాహనారూఢుడై స్వామి అశ్వ వాహనంపై తిరుమలలో విహరిస్తున్న శ్రీ వేంకటేశ్వరుడు భక్తులకు కలిదోషాలు లేకుండా చేసేందుకే కల్కి అవతారం తిరుమాఢవీధుల్లో అశ్వముపై దర్శనమిస్తున్న శ్రీనివాసుడు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు
మాజీ క్రికెటర్ వి వి ఎస్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ఈరోజు ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనం ఆనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీవారి ఆలయంకు ఒక్క రోజు అలంకరణకు అయ్యే ఖర్చును వివిఎస్.లక్ష్మణ్ విరాళంగా అందించారు.దాదాపు 14 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చిన ఆయన, శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం మొదలుకుని శ్రీవారి గర్భాలయం వరకూ టిటిడి ఉద్యానవనం సిబ్బంది వివిధ రకాల అలంకరణను ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించారు.
అనంతపురం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా జరిగింది. అమరుల త్యాగాలు, ఆశయాలను స్పూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితమవుదాం అని అనంతపురం రేంజ్ .ఐ.జి RN అమ్మిరెడ్డి , జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పోలీసులకు సంయుక్తంగా పిలుపునిచ్చారు. జిల్లా ప్రశాంతత, ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసుల విధులు నిర్వర్తించాలని వారు కోరారు.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన మంగళగిరి టిడిపి కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. నవంబర్ 1 నుండి నారా లోకేష్ బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మరోవైపు నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు అరెస్టు తట్టుకోలేక అసువులు బాసిన కుటుంబాలను పరామర్శించేందుకు సిద్ధమయ్యారని, రాబోయే రోజుల్లో జగన్ పాలను అంతమొందించడమే టిడిపి జనసేన ప్రధాన లక్ష్యమని టిడిపి జనసేన కలిసికట్టుగా వైసీపీని ఓడించి తీరుతామంటున్న టిడిపి మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు తో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో కనకదుర్గమ్మవారిని పూజిస్తారని, చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ విజయదశమి అని పేర్కొన్నారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో, సిరిసంపదలతో తులతూగాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ దుర్గామాత ఆశీస్సులు… దీవెనలు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు.




Total views : 202964