Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా మంత్రి నారా లోకేష్.

ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా మంత్రి నారా లోకేష్.

by CVR NEWS
ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా మంత్రి నారా లోకేష్

ఓ ప్రముఖ మీడియా కాంక్లేవ్ లో పాల్గొనడానికి మంత్రి నారా లోకేష్ హస్తినకు చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో లోకేష్ కు టీడీపీ ఎంపీలు సాదరంగా స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ జాతీయ స్థాయిలో రెండు ప్రముఖ మీడియా సంస్థలు నిర్వహించే సదస్సులలో పాల్గొంటారు. ఓ ప్రముఖ మీడియా సంస్థలు నిర్వహించనున్న వేర్వేరు కాంక్లేవ్‌లలో మంత్రి లోకేశ్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సదస్సుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దార్శనికతను, పాలన విధానాలను జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా ఏపీ విజన్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గత రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన ప్రగతి వంటి అంశాలపై లోకేశ్ మాట్లాడనున్నారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ఈ వేదికలను ఆయన ఉపయోగించుకోనున్నారు. ఈ పర్యటన ద్వారా ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యతలను జాతీయ స్థాయిలో వివరించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: