సాలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీకి చెందిన సుమారు 230 గిరిజన కుటుంబాలు వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఈ భారీ చేరికల కార్యక్రమం జరిగింది. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్టీలోకి వచ్చిన గిరిజన కుటుంబాలకు పసుపు కండువాలు కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను చూసే ఇతర పార్టీల నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీ వైపు వస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంతాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే మార్పు కనిపిస్తోందని పార్టీలో చేరిన గిరిజన పెద్దలు అభిప్రాయపడ్డారు. పద్మాపురం పంచాయతీ నుంచి ఇంత పెద్ద సంఖ్యలో కుటుంబాలు తరలిరావడంతో ఆ ప్రాంతంలో వైఎస్సార్సీపీ దాదాపు ఖాళీ అయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సాలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
45
previous post



Total views : 207682