విజయవాడను డయేరియా వణికిస్తోంది. గిరిపురంలో వారం రోజులుగా అతిసారం కలకలం రేపుతోంది. చిన్నారులు, పెద్దలు వాంతులు విరోచనాలతో విలవిలలాడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే విజయవాడలో డయేరియా ప్రబలటం నిత్యకృత్యమైంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటంలో అధికారులు విఫలం చెందుతున్నారు. నల్లాల్లో అపరిశుభ్రమైన నీరు వస్తుందని గిరిపురంవాసలు వెల్లడించారు. పైప్ లైన్ లీకేజీల వల్ల నీరు కలుషితం అవుతుందని అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని స్థానికులు వెల్లడించారు. డయేరియా పీఢితులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.విజయవాడలో వర్షకాలంలో డయేరియా ప్రబలటం కొత్తేమి కాదు. గతంలో మొగల్రాజపురం, రాజరాజేశ్వరిపేటలోనూ డయేరియా ప్రబలి రెండేళ్లలో 15 మంది చనిపోయారు. విజయవాడలో ఏటా పరిస్థతి ఇంత తీవ్రంగా తలెత్తుతున్నా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటంలేదు. డయేరియా పై తీవ్ర స్థాయిలో విమర్శలు రావటంతో ఎట్టకేలకు స్పందించిన అధికారులు గిరిపురంలో శిబిరాలు ఏర్పాటు ఏశారు. ఇంటింటికి వెళ్లి రోగులను గుర్తించి పలువురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గిరిపురంలో డయేరియా ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సందర్శించి బాధితులను పరామర్శించారు. ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిందని ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
విజయవాడ గిరిపురంలో డయేరియా కలకలం.
51
previous post





Total views : 219347