Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh అభివృద్ధి, సుపరిపాలన ద్వారానే ఓట్లు పడతాయి..

అభివృద్ధి, సుపరిపాలన ద్వారానే ఓట్లు పడతాయి..

by CVR NEWS
అభివృద్ధి, సుపరిపాలన ద్వారానే ఓట్లు పడతాయి

చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలని, గొడ్డలి పార్టీ విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం చంద్రబాబు పిలుపు ఇచ్చారు. SIRపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వర్క్ షాప్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎస్ఐ ఆర్ పై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు చెప్పారు. పార్టీ పెట్టినప్పటి నుంచి హిందూపురం, కుప్పం సహా ఇంకొన్ని నియోజకవర్గాల్లో గెలుస్తూనే ఉన్నామనీ.. ఇలాంటి నియోజకవర్గాల సంఖ్య పెరగాలన్నారు. కొత్తగా ఎమ్మెల్యేలు వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదనీ..మళ్లీ మళ్లీ గెలిచేలా ప్రజలతో మమేకం కావాలని సూచించారు. అభివృద్ధి, సుపరిపాలన ద్వారానే ఓట్లు పడతాయి. ప్రజా ప్రతినిధుల వ్యవహర శైలి ద్వారా ఓట్లు పెరుగుతాయి.. తగ్గుతాయని అన్నారు. ప్రజల కోసం ఎక్కువగా పని చేసినా నోరు అదుపులో పెట్టుకోకుంటే నష్టమే జరుగుతుందని హెచ్చరించారు. కార్యకర్త మొదలుకుని నాయకుడి వరకు ప్రతి ఒక్కరికీ క్యారెక్టర్, ట్రస్ట్ అనేది చాలా ముఖ్యమని చంద్రబాబు హితవు చెప్పారు. ఎన్నికల్లో హామీ ఇచ్చి.. మొదటి సంతకం పెట్టి మెగా డీఎస్సీ నిర్వహించామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ జరగకూడదని 241 కేసులు వేసి అడ్డుకున్నారన్న చంద్రబాబు.. వాటిని ఎదుర్కొని అత్యంత పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించి.. నియామకాలు పూర్తి చేశామన్నారు.పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు,గట్టిగా కౌంటర్లు ఇస్తే.. ఇప్పుడు తోకముడిచారని సీఎం చంద్రబాబు అన్నారు.

నంద్యాలలో వైసీపీ కార్యకర్తే వైఎస్ విగ్రహం తల తీసేశారు.. పోలీసులు నిమిషాల్లో పట్టుకున్నారు, వైసీపీ కార్యకర్తను గుర్తించకుంటే టీడీపీ మీద నెపం నెట్టేవారని చంద్రబాబు అన్నారు..వివేకా హత్య అనేది ఓ కేస్ స్టడీ అన్న చంద్రబాబు..చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి… లేకుంటే విషం చిమ్ముతుంది… దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. అంతేకాదు గొడ్డలి పార్టీతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.తాను ఎన్నో పోరాటాలు చేశాను.. కానీ నీచులతో ఎప్పుడూ పోరాటాలు చేయలేదన్నారు.

కార్యకర్తల సాధికారత గురించి ఆలోచించాలి… కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని టీడీపీ తప్ప ఏ పార్టీ పెట్టలేదన్నారు. చనిపోయిన కార్యకర్తలకు రూ. 5 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నామనీ… పిల్లల చదువుకు ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేశామన్నారు.కార్యకర్తల పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి మంచి ఉద్యోగాలకు సిఫార్సులు చేస్తున్నామన్నారు. కార్యకర్తల ఆర్థిక సాధికారత కోసం ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.ప్రతీ కార్యకర్త ఆరోగ్యంగా ఉండడానికి ఎంతైనా ఖర్చు చేస్తామని భరోసా ఇచ్చారు.మన కార్యకర్తలను ఆదుకునేందుకు పార్టీ చర్యలు తీసుకుంటుంది,ప్రతీ నాయకుడు ఇదే విధంగా ఆలోచన చేయాలన్నారు.మనకు తెలిసి కానీ తెలియకుండా కానీ తప్పులు జరగకూడదు.. అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.గత ప్రభుత్వంలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెడుతున్నామన్న చంద్రబాబు..ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పోయిన బ్రాండ్ ను మళ్లీ తెచ్చామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆగిపోతుందని అందరూ భయపడ్డారు.. కానీ మళ్లీ ప్రాజెక్టును ట్రాక్‌లో పెట్టామన్నారు.సంక్షేమం అందిస్తున్నాం… అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామన్న చంద్రబాబు..ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దని చంద్రబాబు హితవు పలికారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: