Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News ఆత్మకూరు డిపో ఆర్టీసీ అద్దె బస్సు చోరీ

ఆత్మకూరు డిపో ఆర్టీసీ అద్దె బస్సు చోరీ

by Rama
ఆత్మకూరు డిపో ఆర్టీసీ అద్దె బస్సు చోరీ

మద్యం మత్తులో ఓ వ్యక్తి పుట్టింట్లో ఉన్న తన భార్యను చూసేందుకు ఏకంగా ఆర్టీసీ అద్దె బస్సును చోరీ చేసిన ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో తాజాగా వెలుగు చూసింది. స్థానికంగా నివసించే దరగయ్య లారీ డ్రైవర్. ఇతడి భార్య పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రిలోని తన పుట్టింటికి వెళ్లారు. అయితే, ఆమెను చూసేందుకు ముచ్చుమర్రి వెళదామనుకున్న దరగయ్య శనివారం తెల్లవారుజామున ఆత్మకూరు బస్‌స్టాండ్‌కు వచ్చాడు. ఆ సమయంలో బస్సులేమీ లేకపోవడంతో సమీపంలో నిలిపి ఉంచిన ఆర్టీసీ అద్దె బస్సు ఎక్కాడు. అందులో దాచి ఉంచిన తాళాలు వెతికి పట్టుకుని వాహనం స్టార్ట్ చేసి ముచ్చుమర్రికి బయలుదేరాడు. ఆ తరువాత కాసేపటికి అక్కడికి వచ్చిన మరో డ్రైవర్ తాను గత రాత్రి నిలిపి ఉంచిన బస్సు చోరీ అయ్యిందని భావించి వాహన యజమానికి సమాచారం అందించాడు.
ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టగా బస్సు నందికొట్కూరు వైపు వెళుతున్నట్టు తెలిసింది.ఆత్మకూరు డిపో ఆర్టీసీ అద్దె బస్సు చోరీ. అంతేకాకుండా, వెనక నుంచి వస్తున్న మిగతా బస్సులకు దరగయ్య దారి ఇవ్వకపోవడంతో వారికి అనుమానం వచ్చి యజమానికి సమాచారం అందించారు. దీంతో, ఆయన పోలీసులకు ఈ విషయాన్ని చేరవేశారు. పోలీసులు చోరీ అయిన బస్సును ముచ్చుమర్రి వద్ద ఆపి దరగయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతడు గతంలోనూ ఇలా మతిస్థిమితం లేని సందర్భాల్లో లారీలను తీసుకెళ్లేవాడని బంధువులు తెలిపారు. అయితే, ఘటనపై బస్సు యజమాని ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు దరగయ్యను హెచ్చరించి పంపేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
    వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
  • రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
    రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
  • బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
    యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
  • యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
    హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్‌ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
  • ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.
    ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

039479
Total views : 197054

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: