హైదరాబాద్‌లో బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది. పాతబస్తీలోనివైభవంగా సింహవాహిని అమ్మవారి బోనాలు సంబురాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లాల్‌దర్వాజ సింహవాహినీ మహంకాళి మందిరంతోపాటు అక్కన్న మాదన్న ఆలయం, ఉమ్మడి దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వైభవంగా సింహవాహిని అమ్మవారి బోనాలు చారిత్రక లాల్‌దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అలయానికి పలువురు మంత్రులతో పాటు, వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా సింహవాహిని మహంకాళిని భక్తులు కొలుస్తారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తారు. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అభిషేకాలు, కుంకుమార్చనలతో ఆలయాల్లో సందడి కొనసాగుతోంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్.దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- 22ఏపై బీజేపీ దీక్షలు.భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
- భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి