మద్యం మత్తులో ఓ వ్యక్తి పుట్టింట్లో ఉన్న తన భార్యను చూసేందుకు ఏకంగా ఆర్టీసీ అద్దె బస్సును చోరీ చేసిన ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో తాజాగా వెలుగు చూసింది. స్థానికంగా నివసించే దరగయ్య లారీ డ్రైవర్. ఇతడి భార్య పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రిలోని తన పుట్టింటికి వెళ్లారు. అయితే, ఆమెను చూసేందుకు ముచ్చుమర్రి వెళదామనుకున్న దరగయ్య శనివారం తెల్లవారుజామున ఆత్మకూరు బస్‌స్టాండ్‌కు వచ్చాడు. ఆ సమయంలో బస్సులేమీ లేకపోవడంతో సమీపంలో నిలిపి ఉంచిన ఆర్టీసీ అద్దె బస్సు ఎక్కాడు. అందులో దాచి ఉంచిన తాళాలు వెతికి పట్టుకుని వాహనం స్టార్ట్ చేసి ముచ్చుమర్రికి బయలుదేరాడు. ఆ తరువాత కాసేపటికి అక్కడికి వచ్చిన మరో డ్రైవర్ తాను గత రాత్రి నిలిపి ఉంచిన బస్సు చోరీ అయ్యిందని భావించి వాహన యజమానికి సమాచారం అందించాడు.
ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టగా బస్సు నందికొట్కూరు వైపు వెళుతున్నట్టు తెలిసింది.ఆత్మకూరు డిపో ఆర్టీసీ అద్దె బస్సు చోరీ. అంతేకాకుండా, వెనక నుంచి వస్తున్న మిగతా బస్సులకు దరగయ్య దారి ఇవ్వకపోవడంతో వారికి అనుమానం వచ్చి యజమానికి సమాచారం అందించారు. దీంతో, ఆయన పోలీసులకు ఈ విషయాన్ని చేరవేశారు. పోలీసులు చోరీ అయిన బస్సును ముచ్చుమర్రి వద్ద ఆపి దరగయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతడు గతంలోనూ ఇలా మతిస్థిమితం లేని సందర్భాల్లో లారీలను తీసుకెళ్లేవాడని బంధువులు తెలిపారు. అయితే, ఘటనపై బస్సు యజమాని ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు దరగయ్యను హెచ్చరించి పంపేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్.దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- 22ఏపై బీజేపీ దీక్షలు.భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
- భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి