Prakash
అక్షయ తృతీయ | Akshaya Tritiya
భారతదేశం సంప్రదాయాలకు పుట్టినిల్లు. భారతదేశంలో హిందువులు ఎంతో సాంప్రదాయంగా జరుపుకునే పండుగలలో అక్షయ తృతీయకు(Akshaya Tritiya) ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా భారతదేశంలో మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఈ అక్షయ తృతీయ పండుగ రోజున లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఆ ఇంట్లో సిరి సంపదలు వస్తాయని నమ్మకం.లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ రోజున హిందువులు, జైనులు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. అంతేకాకుండా పురాణాల ప్రకారం శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజని అందువల్లే అక్షయ తృతీయ రోజున బంగారం కొని ఇంట్లో లక్ష్మీదేవిని అలంకరించి పూజిస్తే సిరిసంపదలు కురిసి అష్టైశ్వర్యాలు కలుగుతాయని.. వాటికి కుబేరుడు రక్షణగా ఉండి జీవితం సుఖసంతోషాలతో నిండుతుంది అని తెలుపుతున్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పల్నాడు జిల్లా (Palnadu YCP Attack)
గురజాల నియోజకవర్గంలో రోజురోజుకు పెరుగుతున్న దాడులు. గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామం లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పొట్ల లక్ష్మీనారాయణ ఫై రాత్రి వైసీపీ శ్రేణుల దాడి. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఆయనను వైద్యశాలకు తరలించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
రాత్రి గ్రామం లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి పర్యటన అనంతరం వైసీపీ శ్రేణులు గుంపులుగా వచ్చి దాడి చేసినట్లు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలే టార్గెట్ గా కొనసాగుతున్న దాడులు. టీడీపీ ఎలక్షన్ ప్రచారం నిర్వహిస్తుందని వైసీపీ అక్కసుతో దాడులు చేస్తున్నారని అంటున్నా టీడీపీ శ్రేణులు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం
ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ కు మద్ధతుగా తనయుడు జోగి రాజీవ్ ఎన్నికల ప్రచారం..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జోగి రాజీవ్ కామెంట్స్ (Jogi Rajeev)
జగనన్న ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించారు. ఎన్నికల ముందు చంద్రబాబు పసుపు కుంకుమ ఆపలేదు. ఐదు ఏళ్ల నుండి అందిస్తున్న పథకాలను బాబు ఆపించాడు. కుట్ర చేసి పథకాలు ఆపించాడు. ఎన్డీఏ ఎలయన్స్ పాత చింతకాయ పచ్చడి. బూత్ స్థాయి నుంచి వైసీపీ పటిష్టంగా ఉంది. మా సంక్షేమ పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయి. జోగి రమేష్ ను ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ ను గెలిపించండి. పెనమలూరు గెలిచి జగనన్నకు బహుమతిగా అందిస్తాం.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP Election Heat:
14 నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో(Kurnool) ఈసారి ప్రజలు తీర్పు ఎలా ఉండబోతుంది…? కర్నూలు జిల్లా సెంటిమెంట్ నాయకులు కలిసివస్తుందా…! ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి (Election Heat) నిప్పుల సెగలు కక్కుతుంది. ఎన్నికల సంగ్రామానికి మరికొద్దిరోజులే సమయం ఉండడంతో రాజకీయ పార్టీ నాయకుల్లో అలజడి మొదలైంది. ఈ సారి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ నాయకుల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలు జిల్లా ఈ ఎన్నికల్లో కీలకం కానుంది.
రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లా నుంచి పోటీ చేసిన నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అయిన చరిత్ర కలిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాపై పట్టు సాధించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న వ్యూహత్మక రచనలు మాములుగా లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక జరిగిన 2014 ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పార్టీకి కేవలం 3 అసెంబ్లీ స్థానాలు మాత్రమే లభించాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మిగితా 11 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో వైస్సార్సీపీ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందిన అనూహ్యంగా రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని చేపట్టింది. కానీ మళ్ళీ 2019 ఎన్నికల్లో వైస్సార్సీపీ 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి ఉమ్మడి కర్నూలు జిల్లాను క్లీన్ స్వీప్ చేసి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. కానీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా తమ పట్టు నిలుపుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరుస పర్యాటనలు చేస్తూపార్టీ నాయకులు కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
అదే రీతిలో ప్రస్తుతం వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సైతం తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న.. వరుసగా జిల్లా పర్యటనలు చేపడుతున్నారు. ఎంతలా అంటే గడిచిన నెలరోజులలో ఏకంగా 5 సార్లు జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ మోహన్ రెడ్డి మరో మారు తన మార్క్‌ను వేసుకునేందుకు జిల్లాకు రానున్నారు. ముఖ్యంగా కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఈ సారి సిట్టింగ్ ఎమ్మెల్యే ను కాదని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను రంగంలోకి దించిన జగన్ ఎలాగైనా కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ లో తన అభ్యర్థి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ AMd ఇంతియాజ్ అహ్మద్ ను గెలుపుంచుకునేందుకు జిల్లా కేంద్రంలో ఉన్న వైస్సార్ సర్కిల్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ ఎన్నికల్లో తమ పట్టు సాధించుకునేందుకు టీడీపీ, మరోవైపు తమ పట్టును కోల్పోకుండా ఉండేందుకు వైస్సార్సీపీ పార్టీలు తీవ్రంగానే శ్రామిస్తున్నాయి. కానీ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ మాత్రం నాయకులకు గుబులు పుట్టిస్తుంది.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
PM Modi Road Show :
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్ధుల కోసం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగడంతో మూడు పార్టీల శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. బుధవారం విజయవాడలో మోదీ రోడ్ షోకి ప్రజలు సైతం బ్రహ్మరథం పట్టారు. జనం నుంచి వచ్చిన స్పందన చూసి ప్రధాని వైసీపీపై ట్వీట్ చేశారు.
బుధవారం విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra babu), జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) లతో కలిసి ప్రజాగళం రోడ్ షోలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏపీకి చెందిన ఇద్దరు అగ్రనేతల మధ్య దేశానికే బలమైన నాయకుడిగా పేరు సంపాదించుకున్న మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడకు వచ్చిన మోదీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో పాటు జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. విజయవాడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పొత్తు గెలివాలి..జగన్ రెడ్డి పోవాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
దారి పొడవున మోదీ, చంద్రబాబు(Chandra Babu), పవన్ కల్యాణ్(Pawan Kalyan) త్రయాన్ని చూడటానికి జనం బారులుతీరాలు. కాషాయ, పసుపు జెండాలు పట్టుకొని కూటమి గెలవాలంటూ నినాదాలు చేశారు. బెజవాడ రోడో షో(PM Modi Road Show)కి ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత మోదీ ట్వీట్ చేశారు.
ఈసందర్భంగా నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. విజయవాడలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో తాను పాల్గొన్న రోడ్ షో మరపురానిదని పేర్కొన్నారు. కొన్ని రోజులుగా తాను ఏపీలో పర్యటిస్తున్నానని ..ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్ధులకు ఓట్లు వేస్తారనే విషయం అర్దమైందన్నారు.
ఇక బీజేపీ, టీడీపీ గతంలోనూ కలిసి పనిచేశాయని, భవిష్యత్ అభివృద్ధి దిశగా తమది బలమైన బంధం అని స్పష్టం చేశారు. ఎంతో క్రియాశీలకంగా ఉన్న జనసేన పార్టీ వల్ల తమ కూటమి మరింత బలోపేతం అయిందని వివరించారు. తమ ఆకాంక్షలు నెరవేర్చే సత్తా ఈ కూటమికి ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని మోదీ తన ట్వీట్ లో వెల్లడించారు.
యువత, మహిళల మద్దతు ఎన్డీఏ కూటమికే ఉందని అభిప్రాయపడ్డారు మోదీ. వైసీపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. జూన్ 4 వైసీపీకి చివరి రోజని మోదీ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతితో వైసీపీకి బలమైన అనుబంధం ఉందన్నారు. ఏపీలో అవినీతి, కుటిలత్వం, మాఫియా తత్వాన్ని పెంచి పోషించిందని మోదీ ధ్వజమెత్తారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ప్రధాని మోదీ రోడ్ షో సక్సెస్ కావడం, ఆయన ట్వీట్ పై స్పందించారు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు. నిజంగా ఇది మరపురాని రోడ్ షో అంటూ తమ అనుభూతిని షేర్ చేసుకున్నారు. ఏపీకి భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మీరు, నేను, పవన్ కల్యాణ్ కలిసి పాల్గొన్న రోడ్ షోతో మా ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, యువతలో కొత్త ఆశాదీపం వెలిగించినట్టయింది అని చంద్రబాబు వివరించారు.
పవన్ కల్యాణ్ కూడా రోడ్ షోపై ట్వీట్ చేశారు. మోదీ గారు మీరు ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. ఈ రోడ్ షో జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయి. మీరు సంకల్పించిన వికసిత భారత్ కార్యాచరణ కోసం మేం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని పోస్ట్ పెట్టారు.
ఏపీలో మూడు పార్టీలు జత కట్టినప్పటికి ఇప్పటి వరకు మూడు పార్టీలకు చెందిన అగ్రనాయకులు ఈవిధంగా ఒకే ప్రచారంలో పాల్గొనకపోవడంతో ప్రజల్లో ఈ కూటమిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే బుధవారం రోడ్ షోతో అందరికి క్లారిటీ వచ్చింది.
విజయవాడలో @ncbn గారు @PawanKalyan గారితో జరిపిన రోడ్‌షో మరపురానిది. గత కొన్ని రోజులుగా ఆంధ్ర రాష్ట్రం అంతటా పర్యటించిన తర్వాత, ప్రజలు పెద్ద సంఖ్యలో NDAకి ఓటు వేస్తారని నేను విశ్వసిస్తున్నాను. మహిళలు మరియు యువ ఓటర్లు మేం చేసిన అభివృద్ధిని ఆమోదిస్తున్నారు. @BJP4Andhra @JaiTDP… pic.twitter.com/Y2d0zOoX5m
— Narendra Modi (@narendramodi) May 8, 2024
మరోవైపు వైసీపీకి జూన్4 చివరి రోజని ప్రధాని చేసిన ట్వీట్ పై అధికార పార్టీలో గుబులు మొదలైనట్లుగా తెలుస్తోంది. ప్రజలు వైసీపీ పాలనపై విసుగు చెందారని ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని చెప్పడంపై వైసీపీ నేతలు సైతం అయోమయంలో పడ్డారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోని సూపర్ సక్సెస్ చేసిన ఓఠర్లు తమ అభిమానాన్ని, అభిప్రాయాన్ని ఓట్ల రూపంలో ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలబడతారో లేదో చూడాలి. అయితే అటు వైసీపీ కూడా సింగిల్ గా ప్రచారం చేస్తూనే గెలుపుపై స్పష్టమైన క్లారిటీ మెయిన్ టెన్ చేస్తోంది.
పవన్ సినీ గ్లామర్, మోదీ చరిష్మతో పాటు చంద్రబాబు పరిపాలన అనుభవాన్ని ప్రజలు పరిగణలోకి తీసుకుంటే ఎన్డీఏ కూటిమి అభ్యర్ధులు అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ల్యాండ్ టైటిలింగ్ చట్టం | Land Titling Act
భూముల రక్షణ అని అంటున్నారు కొందరు.. మరి కొందరు భూముల రక్షణ కాదు భూ మాయ అంటున్నారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ.
Follow us on: Facebook, YouTube, Twitter, Instagram
ఇప్పటి వరకు చట్టం అమలు కాలేదు… ఆచరణలోకి రాలేదు కానీ అప్పుడే అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు స్పందించడం తగునా అంటూ వైసీపీ మళ్ళీ తన ప్రతి విమర్శల జోరు సోషల్ మీడియా పేజీల ద్వారా ప్రారంభించింది.
Read Also: గోళ్లు కొరుకుతున్నారా..?
ఏపీ(AP) లో పార్టీలకు ఎన్నికల సమయం కాబట్టి ల్యాండ్ టైట్లింగ్ చట్టం ఒక ఆయుధంలా మారిందని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఇప్పటికే రాజకీయ నేతలు దీనిపై విమర్శలు… ప్రతి విమర్శల జోరు సాగిస్తున్నారు. కానీ ఈ చట్టంపై సోషల్ మీడియాలో విమర్శల పర్వాన్ని ప్రారంభించారు కొందరు. ప్రత్యక్షంగా విమర్శలను వైసీపీ తిప్పికొడుతుండగా, సామాజిక మాధ్యమాల్లో సైతం వైసీపీ నేతలు ఇంకా అమలులోకి రాని చట్టం పై మీ విమర్శలు ఆపాలి అంటూ స్పీడ్ పెంచారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అత్యంత పొడవైన నడక మార్గం | World’s Longest Walk Road
భూమి అన్వేషించబడని ప్రదేశాలతో నిండి ఉంది. సాహసం కోసం ప్రజలు తరచుగా దూర ప్రాంతాలకు వెళుతున్నారు. ఇంకా పూర్తిగా అన్వేషించాల్సిన స్థలం ఒకటి ఉంది. దక్షిణాఫ్రికా(South Africa)లోని కేప్ టౌన్ నుండి రష్యా యొక్క తూర్పు వైపున ఉన్న మగడాన్ ఓడరేవు పట్టణానికి నడవగలిగే పొడవైన దూరం గురించి మీకు తెలుసా? ఇది ఇంకా మానవులచే కొలవబడలేదు. మీడియా నివేదికల ప్రకారం ఇంత సుదీర్ఘ నడకను ఎవరూ పూర్తి చేయలేదు. నెటిజన్లు దీనిని ‘పొటెన్షియల్ లాంగ్‌గెస్ట్ వాక్బుల్ రోడ్’ అని కూడా పిలుస్తారు. ఔట్‌లుక్‌లోని ఒక నివేదిక ప్రకారం, ఈ మార్గం 17 దేశాల గుండా వెళుతుంది, అనేక పర్వతాలు మరియు ఎడారులను దాటుతుంది. రెండు గమ్యస్థానాల మధ్య దూరం 22,387 కి.మీ. మీరు కొన్ని సెకన్లు ఆదా చేయడానికి నలుపు మీదుగా పడవను తీసుకెళ్లడం ద్వారా శ్రమను తగ్గించవచ్చు. ఇది 21,779 కిలోమీటర్లు కొనసాగుతుంది.
Follow us on: Facebook, YouTube, Twitter, Instagram
ప్రయాణీకులు ఆఫ్రికా(South Africa) మీదుగా ప్రయాణించి, టర్కీ, మధ్య ఆసియా మీదుగా సూయజ్ కెనాల్ దాటి సైబీరియాకు రష్యాకు వెళ్లవచ్చు. ప్రయాణికులు వేర్వేరు సమయ మండలాలు మరియు వాతావరణంలో వివిధ దేశాలలో ప్రయాణించవలసి ఉంటుంది.
మీరు కాలినడకన ఈ ప్రయాణానికి బయలుదేరినట్లయితే, మీరు 4,492 గంటల పాటు నిరంతరం నడవాలి. విరామాలు లేకుండా, సమయం 187 రోజులకు చేరుకుంటుంది. మీరు రోజుకు 8 గంటలు వాకింగ్ చేస్తుంటే, అది పూర్తి కావడానికి 562 రోజులు పడుతుంది. ఈ సమయంలో, మీరు కోరుకుంటే, మీరు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని 13 సార్లు జయించవచ్చు మరియు తిరిగి రావచ్చు.
Read Also: గోళ్లు కొరుకుతున్నారా..?
తిండి, నిద్రా మరియు విశ్రాంతి ఈ మూడు ప్రయాణాన్ని పూర్తి చేయడానికి ఒక వ్యక్తికి కావాల్సిన అవసరాలు. ఈ మార్గం యుద్ధంలో ఉన్న దక్షిణ సూడాన్ మరియు సిరియా వంటి వివాదాస్పద దేశాల గుండా వెళుతుంది. మీరు కాలినడకన వెళ్లగలిగే అనేక దేశాలను సందర్శించడానికి మీకు వీసా అవసరం. మీరు వీటిని అధిగమించినా, సహజమైన అడ్డంకులు మిమ్మల్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉంటాయి. సహారా ఎడారి యొక్క మండే వేడి, సైబీరియా యొక్క మంచు మరియు ఆఫ్రికాలోని మలేరియా దోమలు మీ ప్రయాణాన్ని నిజమైన సాహసం చేస్తాయి. మీరు చాలా బూట్లు తీసుకెళ్లాలి, ఎందుకంటే అవి త్వరగా అరిగిపోతాయి. మీరు ఈ మార్గం కోసం Google మ్యాప్స్(Google Maps)ని ఉపయోగించలేరు. ఒక ప్రయాణికుడు మారుతున్న ఉష్ణోగ్రతలను నిలబెట్టుకోవడానికి శరీరానికి బలమైన మనుగడ నైపుణ్యాలు మరియు మంచి రోగనిరోధక శక్తిని కలిగి ఉండాలి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
యాంటీ బయాటిక్స్ ఓవర్ ద కౌంటర్ | Antibiotics
యాంటీ బయాటిక్స్(Antibiotics) అందుబాటులో ఉండడంతో ప్రజలు కామన్ కోల్డ్‌కి కూడా యంటీ బయాటిక్ వేసేసుకుంటున్నారు, లైవ్ స్టాక్‌కి ఇంజెక్ట్ చేస్తున్నారు. కొన్ని హాస్పిటల్స్‌లో సరైన ప్రొసీజర్, పరిశుభ్రత ఉండడం లేదు. ఇవన్నీ కలిపి యాంటీ బయాటిక్స్‌ని తట్టుకుని ఉండే బ్యాక్టీరియా బాగా విస్తరిస్తోంది. కొన్ని యాంటీ బయాటిక్స్‌ని అతిగా వాడడం వల్ల వీటిని తట్టుకుని ఉండే శక్తి బ్యాక్టీరియాకి వస్తోంది.
Follow us on: Facebook, YouTube, Twitter, Instagram
ప్రముఖ ఆరోగ్య సంస్థలు నిర్వహించిన సర్వే ప్రకారం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది పేగుల్లో ఇన్ఫెక్షన్ (ఐబీడీ)తో బాధపడుతున్నారని అంచనా.వచ్చే దశాబ్దంలో వీరి సంఖ్య మరింత పెరుగుతుందనీ భావిస్తున్నారు. ఐబీడీలో క్రోన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ అని రెండు సమస్యలు తలెత్తుతుంటాయి. సాధారణంగా పేగుల్లో ఇన్ఫెక్షన్ సమస్య తలెత్తినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ నియంత్రించడానికి ఇచ్చే నైట్రోఇమిడజోల్స్, ఫ్లూరోక్వినలోన్స్ రకం మందులతో ఎక్కువ ముప్పు పొంచి ఉంటున్నట్టూ పరిశీలనలో వెల్లడైందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Read Also: గోళ్లు కొరుకుతున్నారా..?
ఈ యాంటీబయోటిక్ మందులు పేగుల్లో ఇన్ఫెక్షన్ కు కారణమైన హానికారక బ్యాక్టీరియానే కాదు, మన ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియానూ కూడా నశింపజేస్తుంది. ఫలితంగా తీవ్రమైన పేగు అల్సర్లు, పేగు పూత (ఐబీడీ) వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చిన్న వయసులోనే విచ్చలవిడిగా యాంటీబయాటిక్ మందులు వాడడం వల్ల పేగుల్లో ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువై పేగు పూత (ఐబీడీ) సమస్య తలెత్తుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడివారిలో దీని ముప్పు ఇంకాస్త అధికంగా ఉంటున్నట్టు పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 92757